మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మటన్,చికెన్‌లాంటివే తినవలసిన అవసరం లేదు.కూరగాయల్లో ఎన్నో రకాలైన ప్రోటిన్స్,విటమిన్స్ కలిగినవి ఉన్నాయి ఇవి ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా దాదాపు ఇతర వ్యాధులు రాకుండా కొంతవరకు కాపాడుతాయి.ఇక మన శరీరానికి శక్తినందించే దుంపల్లో బీట్‌రూట్ కూడా ఒకటి.దీన్ని చాలా మంది కూరగా చేసుకుని తింటారు.కొందరు జ్యూస్ తాగుతారు.అయితే రోజూ కూరలా చేసుకుని తినలేమని,జ్యూస్ తాగలేమనుకునే వారు బీట్‌రూట్‌ చారును ట్రై చేయవచ్చూ.ఇది ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇక దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.



బీట్‌రూట్‌ చారుకు కావలసినవి::సన్నగా తరిగిన బీట్‌రూట్‌ ముక్కలు–అర కప్పు; నీళ్లు–తగినన్ని
పొడి చేయడానికి కావలసినవి:జీలకర్ర–ఒక టీ స్పూను..మిరియాలు–అర టీ స్పూను..ధనియాలు–అర టీ స్పూను..ఎండు మిర్చి–1...బీట్‌రూట్‌ రసంకోసం చింతపండు –ఒక టేబుల్‌స్పూను..నువ్వుల నూనె–ఒక టేబుల్‌స్పూను..ఆవాలు–అర టీ స్పూను...ఎండు మిర్చి–1..కరివేపాకు–రెండురెమ్మలు...ఇంగువ–పావు టీ స్పూను...పసుపు–పావు టీ స్పూను..ఉప్పు–తగినంత...కొత్తిమీరతరుగు–2 టేబుల్‌స్పూన్లు.....



తయారీ విధానం::కుక్కర్‌లో బీట్‌రూట్‌ ముక్కలకు,వాటితో పాటు తగినన్నినీళ్లు జత చేసి,స్టౌ మీద ఉంచి ఆరు విజిల్స్‌ వచ్చేవరకు ఉంచి ఉడికించాలి.మిక్సీలో జీలకర్ర, మిరియాలు,ధనియాలు,ఎండు మిర్చి వేసి కొంచెం రవ్వలా ఉండేలా పొడి గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి..అదే జార్‌లో ఉడికించిన బీట్‌రూట్‌ను నీళ్లతో మిక్సీ పట్టాలి..ఇప్పుడు చింతపండు జత చేసి మరోమారు మెత్తగా చేయాలి..స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక,ఆవాలు వేసి చిటపటలాడించి,ఎండు మిర్చి,కరివేపాకు,ఇంగువ జత చేసి దోరగా వేగేవరకు మరోమారు కలియబెట్టాలి..తర్వాత దీనికి మసాలా పొడి జతచేసి కలిపిన తర్వాత,బీట్‌రూట్‌,చింతపండు గుజ్జు రెండు కప్పుల నీళ్లు,పసుపు, ఉప్పు జత చేసి మరోమారు బాగా కలిపి సన్నని మంటమీద కాసేపు ఉండనిచ్చి స్టౌ మీదనుండి దించి వేడి వేడి అన్నంలో వడ్డించుకుని తింటే ఎంత రుచిగా ఉంటుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: