కావాల్సిన ప‌దార్థాలు:
మైదా- పావుకిలో
ఖీమా- అరకిలో
పచ్చిమిర్చి- నాలుగు
అల్లంవెల్లుల్లి- టేబుల్‌స్పూను


గరంమసాలా- ఒకటిన్నర టీస్పూన్లు
ఉల్లిపాయ- 2
పెరుగు- 1 టేబుల్‌స్పూను
నూనె- డీఫ్రైకి సరిపడా


ఉప్పు- తగినంత
కొత్తిమీర - కొద్దిగా
 పుదీనా- కొద్దిగా


త‌యారీ విధానం:
ముందుగా మైదాలో నాలుగు టేబుల్‌స్పూన్ల నూనె, ఉప్పు వేసి కలిపి చిన్న ఉండలుగా చేయాలి. ఒక్కో ఉండనీ చపాతీలా చేసి రెండుగా కోసి మూతపెట్టి ప‌క్క‌న పెట్టుకోవాలి. మ‌రో బౌల్‌లో రెండు టేబుల్‌స్పూన్ల మైదాలో కొద్దిగా నీళ్లు పోసి కలిపి పేస్టులా చేసి పక్కన ఉంచాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లంవెల్లుల్లి వేసి వేయించాలి.


తరవాత కీమా, ఉప్పు వేసి సిమ్‌లో ఉడికించాలి. ఇప్పుడు గరంమసాలా, పెరుగు, కొత్తిమీర, పుదీనా తురుము వేసి కలిపి దించాలి. ఇప్పుడు చపాతీని కోన్‌లా చుట్టాలి. అందులో కూర మిశ్రమాన్ని పెట్టి జాగ్రత్తగా మడిచి అంచులు విడిపోకుండా మైదా పేస్టుతో అతికించాలి. ఇలాగే అన్నీ చేసుకుని కాగిన నూనెలో వేసి గోల్డ్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు ఫ్రై చేయాలి. అంతే ఖీమా స‌మోసా రెడీ..!  


మరింత సమాచారం తెలుసుకోండి: