ఊరందరిది ఒక దారి..ఉలిపి కట్టెది ఒక దారి అనే సామెత ఊరికే పుట్టలేదు. ప్రపంచం అంతా కరోనా రక్కసి బారిన పడి అల్లకల్లోకం అవుతుంటే వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకుని లక్షలాది మంది కరోనా తో యుద్ధం చేస్తుంటే కొందరు మాత్రం ప్రపంచానికి భిన్నంగా వెళ్తున్నారు. అలాంటి ఘటనే ఏపీ లోని పశ్చిమ గోదావారి జిల్లా తాడేపల్లి గూడెం లో చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఒక్క సారిగా పోలీసులు..చుట్టుపక్కల ప్రజలు అందరూ నిర్ఘాంతపోయారు..ఇంతకీ ఏమి జరిగింది..??

IHG

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో సలాం సెంటర్ వద్ద ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా కొందరు పేకాట ఆడుతున్నట్లుగా పోలీసులకి సంచారం అందింది. అసలే కరోనా డ్యూటీ లో రేయింబవళ్ళు నిద్రలు లేకుండా డ్యూటీ లు చేస్తూ ఉన్న పోలీసులు ఈ సంచారంతో  ఒక్క సారిగా షాక్ అయ్యారు. ప్రపంచం మొత్తం కరోనా తో కంగారు పడిపోతుంటే వెళ్ళు తాపీగా పేకాట ఆడుతున్నారు ఇది నిజమో కాదు అనుకుంటూ సంచారం ఇచ్చిన చోటికి వెళ్లి చూశారు..

IHG

కనీస సామాజిక భాద్యత మరించి పేకాట ఆడుతున్న కొందరిని ఎస్.ఐ శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు. వారి నుంచీ కొంత మేర నగదు దొరకగా అందరిని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. ఈ విషయంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు...ఎంతో మంది జీతాలు లేకపోవడంతో, ఉద్యోగాలు దొరక కరోన కారణంగా ఆకలితో అలమటిస్తుంటే వీళ్ళు మాత్రం వేలకి వేలు జూదంలో పెట్టి ఆడటం వీళ్ళ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అంటుంటే, పాపం బాగా గ్యాప్ వచ్చింది కాబోలు కక్కూర్తి పడ్డారు అడ్డంగా దొరికిపోయారు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.  

 

     

మరింత సమాచారం తెలుసుకోండి: