విశాఖ‌ప‌ట్నం జిల్లా ఏజెన్సీలో దారుణం చోటు చేసుకుంది. తాడి క‌మ్మ‌లు తెచ్చుకునేందుకు భార్య‌, భ‌ర్త‌లు ఇద్ద‌రూ జ‌లాశ‌యం నుంచి నాటు ప‌డ‌వ మీద అటు వైపు ఒడ్డున‌కు వెళ్లారు. తాటిక‌మ్మ‌లు వేసుకుని తిరిగి ఇటు వైపు వ‌డ్డున‌కు వ‌స్తుండ‌గా బ‌లంగా ఈదురు గాలులు.. వ‌ర్షం ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో ఈ భీకర గాలుల‌కు నాటుపడవ కుదుపులకు గురవడంతో దంపతుల గుండెల్లో అలజడి రేగింది. ఇద్ద‌రు ప‌డ‌వ నుంచి కింద‌ప‌డ్డారు.. భార్య‌ను కాపాడుకునేందుకు భ‌ర్త చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌లం కావ‌డంతో చేసేదేం లేక భ‌ర్త ఒక్క‌డే ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు.

 

విశాఖ‌ప‌ట్నం జిల్లాలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. తాటికమ్మలు తెచ్చుకునేందుకు దారపర్తి కొండలరావు, దేముడమ్మ దంపతులు జ‌లాశ‌యం అడు వైపు ఒడ్డున‌కు నాటు ప‌డ‌వ‌లో వెళ్లారు. ఈ తాటిక‌మ్మ‌లు సేక‌రించి వ‌స్తుండ‌గా ఈదురు గాలుల‌తో ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఊహించ‌ని విధంగా ప్ర‌మాదంలో చిక్కుకున్నారు. జలాశ‌యంలో నీళ్లు సుడులు వేయ‌డంతో ప‌డ‌వ బోల్తా ప‌డి కింద‌ప‌డిపోయారు. నీళ్ల సుడుల్లో మునిగిపోతోన్న భార్య దేముడ‌మ్మ‌ను కాపాడుకునేందుకు కొండ‌ల‌రావు విఫ‌ల ప్ర‌య‌త్నం చేశారు. 

 

చివ‌ర‌కు చేసేదేం లేక త‌న ప్రాణాలు కాపాడుకోవ‌డం కోసం ఈదూకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.  త‌ర్వాత ఈ విష‌యం పోలీసు, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. దేముడమ్మ మృతదేహం జలాశయంలో పైకి తేలడంతో ఒడ్డుకు చేర్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: