ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను చుట్టేసింది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి అటు ప్ర‌జ‌లు.. ఇటు ప్ర‌భుత్వాలు చిగురుటాకుల వ‌ణికిపోతున్నాయి. ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా క‌రోనా కాటు త‌ప్ప‌డం లేదు. దీంతో ప్ర‌జ‌లు ప్రాణాల‌ను గుప్పెట్లో పెట్టుకుని బ్ర‌తుకుతున్నారు. మ‌రోవైపు ప్ర‌భుత్వాలు సైతం వ్యాక్సిన్ లేని మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఇప్ప‌టికే క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డం లేదు. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 25 ల‌క్ష‌ల మార్క్ దాటేసింది.

 

అలాగే క‌రోనా సోకి మృత్యువాత ప‌డ్డావారి సంఖ్య 1.70 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా కామంతో క‌ళ్లు ముసుకుపోయిన కామాంధుల ఆగ‌డాలు త‌గ్గ‌డం లేదు. ఓ వైపు ప్ర‌భుత్వాలు ఎప్ప‌టిక‌ప్పుడు క‌రోనా వ‌స్తుంది జాగ్ర‌త్త‌ని హెచ్చ‌రిస్తున్నా.. కొంద‌రు కామాంధులు మాత్రం మితిమీరిపోయి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. తాజాగా ఓ మైన‌ర్ బాలిక‌ను  ఇద్దరు కామాంధులు కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 18న గోవింద్‌పూర్‌లోని జేపీ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన 17ఏళ్ల బాలిక నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. 

 

ఆమెను గమనించిన ఇద్దరు కామాంధులు అడ్డగించి కారులోకి లాగారు. ఆ త‌ర్వాత ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం బాలికను దారుణంగా అక్కడే వదిలేసిన నింధితులు కారులో పారిపోయారు. ఈ విషయాన్ని బాలిక తన స్నేహితురాలికి చెప్పగా ఆమె సలహాతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్టం కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన గోవింద్‌పూర్ పోలీసులు నింధితుల కోసం గాలిస్తున్నారు. కాగా, లాక్‌డౌన్ ప్రారంభమయ్యాక భోపాల్‌‌లో నమోదైన రెండో రేప్ కేసు ఇది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: