ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చైనాలోని వూహాన నగరంలో పుట్టుకొచ్చిన ప్రాణాంత‌క‌ర‌ క‌రోనా వైర‌స్‌.. అనాతి కాలంలోనే దేశ‌దేశాలు వ్యాప్తిచెందింది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి అగ్ర‌రాజ్యాలు సైతం కుదేల్ అవుతున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను బ‌ట్టీ చూస్తుంటే.. ఎంత‌టి బ‌ల‌వంతుడైనా క‌రోనా ముందు త‌ల వంచాల్సిందే అన్న‌ట్టు ఉంది. ఇక‌ క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. ప్ర‌జ‌ల‌ను బ‌య‌ట‌కు రాకుండా క‌ఠ‌న ఆంక్ష‌లు విధించాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలో కూడా ఆడ‌వారిపై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. 

 

కామంతో క‌ళ్లు మూసుకుపోయిన కొంద‌రు కామాంధులు ఆడ‌ది క‌ని‌పిస్తే చాలు రెచ్చిపోతున్నారు. చిన్నారులు, మహిళలపై దాడుల నిరోధానికి ఇప్పటికే పోక్సో చట్టం అమలులో ఉండగా ఇటీవల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రభుత్వం దిశ చట్టాన్ని కూడా తీసుకువచ్చింది. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు మృగాల్లో మార్పు రావ‌డం లేదు. ఇక క‌రోనా సోకిన మ‌హిళ‌ల‌ను కూడా కొంద‌రు నీచులు వ‌ద‌ల‌డం లేదు. క‌రోనా సోకినా ప‌ర్వాలేదు.. కామ‌వాంఛ తీర్చుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటున్నారు. తాజాగా గ్రేట‌ర్ నోయిడాలో ఓ ఆస్ప‌త్రిలో ఇటీవ‌లే 20 ఏళ్ల మ‌హిళ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే ప్ర‌స‌వం అయిన కొద్ది రోజుల‌కే ఆమెకు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో నోయిడాలోని శ‌ర్ధ హాస్పిట‌ల్ లో అడ్మిట్ అయింది. 

 

అక్క‌డ ప‌రీక్ష‌లు చేయ‌గా.. ఆమెకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆమెను ఐసోలేష‌న్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే ఆ ఆస్పత్రిలో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆమెను దారుణంగా లైంగికంగా వేధించడం స్టాట్ చేశారు. దీంతో స‌హించ‌లేని స‌ద‌రు మ‌హిళ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరు సిబ్బందిని అరెస్ట్ చేసి విచార‌ణ చేప‌డుతున్న‌ట్టు తెలిపారు. మరోవైపు వారిని ఆస్పత్రి నిర్వహకులు విధుల నుంచి తొలగించార‌ని తెలుస్తోంది. కాగా, ఇటీవలే ముంబైలో కరోనా వ్యాధికి గురైన మహిళపై ఒక డాక్టర్ అత్యాచార యత్నానికి పాల్ప‌డ్డాడు. ప్ర‌స్తుతం కొన్ని ఆసుపత్రుల్లో జరుగుతున్న ఇలాంటి అమానుష ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: