ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ప్ర‌జ‌లు తీవ్ర స్థాయిలో ఇబ్బంది ప‌డుతున్నారు.  దాదాపు 212 దేశాలకు ఈ క‌రోనా వైర‌స్ వ్యాప్తిచెందింది. ఇక కొన్ని నెలలుగా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోన్న క‌రోనాకు పేద, ధనిక దేశమనే భేద లేదంటోంది. దీంతో ఎటు నుంచి వ‌చ్చి ఈ మ‌హ‌మ్మారి కాటేస్తుందో తెలియ‌క‌.. భ‌యం భ‌యంతో ప్ర‌జ‌లు హ‌డ‌లెత్తిపోతున్నారు. ప్ర‌స్తుతం వ్యాక్సిన్ లేని ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించారు. లాక్ డౌన్ కొనసాగిస్తున్నప్పటికీ.. మహమ్మారి విస్తరణకు అడ్డుకట్టవేయడం కుదరడం లేదు. 

 

అయితే మ‌రోవైపు లాక్ డౌన్ సమయంలోనూ దేశంలో ఎక్కడో ఒక చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా చాలా స్ట్రిక్ట్ గా లాక్‌డౌన్ అమలు చేస్తున‌ప్ప‌టికీ.. కామాంధుల ఆగ‌డాలు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. దేశంలో మహిళలకు రక్షణ గాలిలో దీపంలా మారింది. కఠినచట్టాలతో అత్యాచారాలు తగ్గిపోతాయని అనుకున్నారు. కానీ, మహిళలపై అత్యాచారాలు తగ్గడం లేదు. నిత్యం పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు , ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నా.. మృగాలుగా మారుతున్న ‌మ‌నుషుల‌ ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌డం లేదు. ఇక కామంతో క‌ళ్లు మూసుకుపోయిన కొంద‌రు కామాంధులు హిజ్రాల‌ను కూడా వ‌దిలిపెట్ట‌డం లేదు.

 

తాజాగా ఇలాంటి దారుణ ఘ‌ట‌నే యూపీలో చోటుచేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. యూపీలోని బరేలీకి చెందిన ఓ ఆటోడ్రైవర్ తన ఆటోలో ప్రయాణం చేస్తున్న హిజ్రాపై లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేసేందుకు ప్రయత్నం చేశాడు. అయితే ఆటోడ్రైవర్ చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు మిగతా హిజ్రాలకు విషయం చెప్పింది. వెంటనే హిజ్రాలు గుంపుగా వచ్చి ఆటోడ్రైవర్ ను చితక్కొట్టారు. అనంతరం ను పోలీసులకు అప్పగించారు. దీంతో వెంట‌నే కేసులు న‌మోదు చేసుకున్న పోలీసులు అత‌డిని అరెస్ట్ చేసి విచార‌ణ చేప‌ట్టారు.


  

మరింత సమాచారం తెలుసుకోండి: