నేటి స‌మాజంలో ఆడవారిపై అఘత్యాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి. ఇంట బయట ఎక్కడ చూసిన ఏదో ఒక సమయంలో ఆడవారిపై దారుణాలు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. ముఖ్యంగా దేశ భవిశ్యత్తును మార్చే యువతే మహిళలపై ఆఘాత్యాలకు, దారుణాలకు పాల్పడుతూ వారి జీవితాన్ని నాశ‌నం చేయ‌డంతో పాటు తమ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు. ఎన్ని చట్టాలు తెచ్చినా సమాజంలో మార్పు రావడం లేదు. పోలీసులు ఎంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నా.. ఇలాంటి నీచుల్లో మార్పు రావ‌డం లేదు. ఇక తాజాగా ఓ నీచ‌పు భ‌ర్త.. ఏకంగా భార్య న‌గ్న వీడియోల‌ను పోర్న్ సైట్ల‌కు అమ్మేశాడు.

 

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో ఓ వ్య‌క్తి  ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తోంది. అక్కడే స‌హ ఉద్యోగితో అత‌డికి పరిచయం ఏర్పడింది. ఆ ప‌రిచ‌యం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే ఈ విష‌యం తెలుసుకున్న స‌ద‌రు వ్య‌క్తి భార్య..  వివాహేతర బంధాన్ని నిలదీసి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్ర‌మంలోనే భార్య  పరువు తీసి.. విడాకులు ఇచ్చేలా ‌ఓ ప్లాన్‌ సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేశాడు.

 

దీంతో భార్య నగ్నంగా స్నానం చేసిన వీడియోలను సేకరించి వాటిని బూతు సైట్లలో పెట్టాడు. అక్క‌డితో ఆగ‌ని స‌ద‌రు వ్య‌క్తి.. భార్యకు సంబంధించిన ఆ బూతు లింకుల‌ను  బంధువులకు కూడా పంపించి.. డబ్బు కోసం బూతు వీడియోలు చేస్తుందని..ప్రచారం చేశాడు. ఇక భ‌ర్య నీచ‌పు బుద్ధికి భార్య షాక్‌కు గురైంది. ఈ క్ర‌మంలోనే బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఇక బాధితురాలు ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసులు న‌మోదు చేసి.. ఆమె భ‌ర్త‌ను అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: