నేటి స‌మాజంలో ఆడ‌పిల్ల‌కు ఇంటా, బ‌య‌ట కూడా ర‌క్ష‌ణ లేకుండా పోతోంది. పరాయి స్త్రీని మాతృమూర్తితో సమానంగా గౌరవించే సంస్కృతికి పెట్టింది పేరైన భరతగడ్డపై నేడు మహిళలకు భద్రత కరువయ్యింది. గృహ హింస చట్టం, వరకట్న నిషేధ చట్టం, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిషేధ చట్టం.. ఇలా మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చాయి. కానీ మహిళల భద్రతకు మాత్రం హామీ లభించట్లేదు. దేశంలో రోజు రోజుకూ మహిళలపై పెరిగిపోతున్న అకృత్యాలు, అత్యాచారాలు అడ్డుక‌ట్ట ప‌డ‌డం లేదు. 

 

ఎన్ని చట్టాలు వచ్చినా కామంతో క‌ళ్లు మూసుకుపోయిన కొంద‌రు మ‌గాళ్లు కాదు కాదు మృగాళ్లు.. చిన్నారులు, మహిళలపై  పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. వావివరసలు చూడకుండానే కామ వాంఛ తీర్చుకోవాలని చూస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండానే అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. మ‌హిళ ఒంటరిగా క‌నిపిస్తే చాలు.. కామ దాహాన్ని తీర్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే త‌ల్లిదండ్రుల‌కు ఇంటి నుంచి వెళ్ళిన అమ్మాయి క్షేమంగా తిరిగొస్తుందన్న నమ్మకం కూడా ఉండ‌డం లేదు. ఇక తాజాగా స‌మాజానికి అద్దం ప‌ట్టేలా ఓ దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మానసిక వికలాంగురాలు, కన్నకూతురు అని కూడా చూడ‌కుండా.. ఓ కర్కశ తండ్రి మానవత్వం మ‌ర‌చి ఆమెపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

 

ఫలితంగా అభం శుభం తెలియని ఆ మానసిక వికలాంగురాలు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని పంచుకుల జిల్లాలోని సెక్టార్ 18 పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ వ్యక్తి వికలాంగురాలైన 23 సంవత్సరాల కూతురిపై అవమానవీయ స్థితిలో పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ఆమెకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంట‌నే ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ మానసిక వికలాంగురాలు ఓ బిడ్డను ప్రసవించింది. విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్ చేరుకుని కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: