ఒక‌రిని ర‌క్షించేందుకు వెళ్లి..మ‌రోక‌రు మృత్యు వ‌ల‌యంలో చిక్కుకున్నారు. మ‌ర‌ణం పిలిచిందా..?! అన్న‌ట్లుగా...య‌మ‌దూత‌లు ఆవ‌హించిన‌ట్లుగా..టెన్ష‌న్ కొంత‌..అదుర్థ మ‌రికొంత క‌ల‌సి..తండ్రి..కొడుకు, మేన‌ల్లుడు ఒకేసారి చెరువులో నీట మునిగి తిరిగిరాని లోకాల‌కు చేరుకున్నారు. ఈ విషాద సంఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలోని రేపాక చెరువులో మంగ‌ళ‌వారం ఉద‌యం జ‌రిగింది. లక్ష్మీపురం గ్రామానికి చెందిన నల్లమోతు అప్పారావు తన కొడుకు తేజ్, మేనల్లుడు వినయ్‌తో క‌లిసి పొలం వ‌ద్ద‌కు వెళ్లాడు. తేజ్ సరదాగా పక్కనే ఉన్న చెరువులోకి ఈత‌కు దిగాడు.

 

 అయితే కొంచెం లోతు ప్రాంతంలోకి తేజ్ వెళ్ల‌డంతో మునిగిపోయాడు.  స‌మీపంలో ఉన్నతండ్రి అప్పారావు  కొడుకు నీళ్లలో మునిగిపోతుండ‌టాన్ని గ‌మ‌నించాడు.కొడుకును ర‌క్షించేందుకు వెళ్లిన అప్పారావు కూడా నీటిలో మునిగిపోయాడు. వీరిద్దరిని ర‌క్షించేందుకు య‌త్నించి నీళ్ల‌లోకి దిగిన విన‌య్‌కుడా నీట మునిగి మృత్యువాత ప‌డ్డాడు. అటుగా వెళ్లిన స్థానికులు ప్ర‌మా దాన్ని గుర్తించి ర‌క్షించే ప్ర‌య‌త్నం చేసిన ఫ‌లితం లేకుండా పోయింది. చెరువులో గాలించి ముగ్గురి మృత‌దేహాల‌ను వెలికి తీశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మ‌ర‌ణించ‌డంతో కుటుంబ స‌భ్యుల రోద‌న‌లు మిన్నంటాయి. 

 

అప్ప‌టి వ‌ర‌కు త‌మ‌తో క‌ల‌సి ఉన్న ముగ్గురు కొద్దినిముషాల్లోనే విగ‌త జీవులుగా మార‌డాన్ని ఆ కుటుంబ స‌భ్యులు త‌ట్టుకోలేక‌పోయారు. కుటుంబ‌స‌భ్యులు విల‌పిస్తున్న తీరు గ్రామ‌స్థులంద‌రిని కంట‌త‌డిపెట్టించింది. పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లాన్ని సంద‌ర్శించి ప్ర‌మాదం జ‌రిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. పంచ‌నామా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర‌భుత్వం నుంచి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించేలా చూడాల‌ని ప్ర‌భుత్వాన్ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: