కరోనా మహమ్మారి అరికట్టేందుకు లాక్ డౌన్ విధానం అమలు అవడంతో చాలా మంది ఉపాధి కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా వారి రోజువారి జీవనం కూడా గడవని పరిస్థితి ఏర్పడింది. ఏమైనా పని చేసుకుని బతుకుతాము అంటే పని లేక.. పొట్ట నింపుకునేందుకు తిండిలేక చాలామంది దయనీయ పరిస్థితిలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు రోడ్లపై తిరగాలంటేనే భయపడిపోతున్నారు.. 

 


మరోవైపు సెక్స్ వర్కర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కస్టమర్లను కలిసే లేనందున వారి రోజు వారీ జీవనం కొనసాగక తిండి తిప్పలు లేకుండా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక తమిళనాడు సెక్స్ వర్కర్లు ఏమీ చేయలేని పరిస్థితిలో ఒక సపరేట్ రూట్ ను ఎంచుకోవడం జరిగింది. పడక సుఖం కోరుకునే వారి కోసం వీడియో కాల్స్ చేస్తూ... వారి 
కడుపు నింపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కస్టమర్లతో సెక్స్ చాట్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు. గతంలో సంపాదించుకోండి అంతా సంపాదించుకో లేకపోయినా పొట్ట నింపుకుంటున్నారు. అసలు ఏమీ లేదనుకుంటే పస్తులుండే కంటే వచ్చిన దానితో తృప్తి పడుతున్నాడు.

 


ఈ విపత్కర పరిస్థితుల్లో కొద్దిపాటి డబ్బుతోనే పిల్లలు పోషించుకుంటూ కాలంని గడిపేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఒక సెక్స్ వర్కర్ మాట్లాడుతూ... రెండు నెలల నుంచి పని లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం... అసలు ఏమీ లేకుండా ఉండే కంటే ఏదో కొంత వీడియో కాల్స్ ద్వారా సంపాదించుకుంటున్న మన అని తెలియజేసింది. రాత్రి సమయంలో పిల్లలు విధించిన తర్వాత మేకప్ వేసుకొని టెర్రస్ పైకి వెళ్లి కస్టమర్లకు వీడియో కాల్ చేస్తూ... వాళ్ళు గూగుల్ పే లో డబ్బులు పంపిస్తారు అని తెలియజేసింది. ఇలా ఉండగా స్మార్ట్ ఫోన్ వీడియో కాల్స్ చేయటంలో ట్రాన్స్ జెండర్ లు మిగిలిన సెక్స్ వర్కర్ల కంటే ముందు స్థాయిలో ఉన్నారు. 

 


వారు కస్టమర్లకు వీడియో కాల్ చేసే వారిలో దాదాపు 90 శాతం మంది వారే ఉన్నట్లు అంచనా కూడా వేస్తున్నారు. ఈ విషయంలో మహిళా సెక్స్ వర్కర్స్ కొంచెం వెనుకబడి ఉన్నట్లే అర్థమవుతుంది. ఏమైనా కానీ వీడియో కాల్స్ చేయడం ఎంతో రిస్క్ పని అనే ఆమె తెలియచేసింది. వీడియో కాల్స్ రికార్డు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ దిక్కులేని పరిస్థితుల్లో ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆమె తెలియచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: