లోకంలో మనుషులను మోసం చేస్తూ ఎంత దర్జాగా బ్రతక వచ్చో, ఆ బండారం బయటపడితే అంతే దరిద్రంగా జీవితాన్ని గడవచ్చు.. క్షణికమైన కోరిక, హద్దులేని ఆశలు.. గాలిలో మేడలు ఇవన్ని మనిషి పతనానికి పునాది వేస్తాయి.. ఇలాంటి వాటి వలలో చిక్కుకుని ఎందరో యువతి యువకులు తమ బంగారు భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు.. అందుకు నిదర్శనమే ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న యువకుడు.. ఆ వివరాలు చూస్తే..

 

 

యుక్త వయస్సు దాటిన మహిళలను, వివాహమైన వారిని టార్గెట్‌ చేసి, వారి చిత్రాలను మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడుతున్న సరిగ్గా మీసాలు కూడా రాని మన్మథుడిని పట్టుకున్న పోలీసులు తమదైన స్టైల్లో ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. కాగా ఇతగాడి చేతిలో మోసపోయిన వాళ్లు ఎక్కువగా ఉండటంతో కేసు సీబీసీఐడీకి చేరింది. ఇక ఆంటీలను టార్గెట్‌ చేసి, అంకుల్స్‌కు సైతం ముచ్చెమటలు పట్టిస్తున్న నవ మన్మథుడి చరిత్ర చాలా పెద్దదే.. ఇతను ఉండేది కన్యాకుమారి జిల్లా నాగర్‌ కోయిల్‌లో.. ఇతన్ని పధకం ప్రకారం పట్టుకున్న పోలీసులు మోసాల చిట్టా తవ్వితే భయటపడిన నిజాలు అధికారులను సైతం విస్మయానికి గురిచేసాయి..

 

 

ఇకపోతే ఈ కామాంధుడు స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నట్టు, అతడు ఉలగనాథపురానికి చెందిన రోహిత్‌ అని తేలింది. సరిగ్గా మీసాలు కూడా రాని ఇతడు ఫేస్‌ బుక్, టిక్‌ టాక్, వాట్సాప్‌ల ద్వారా యుక్త వయస్సు దాటిన వాళ్లు, వివాహమైన మహిళల్ని టార్గెట్‌ చేసి, వారితో పరిచయాలు పెంచుకోవడమే కాదు, వారి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వారికే పంపి బెదిరించడం, లేదంటే లొంగ దీసుకోవడం, మరి కొందరి వద్ద నగదు దోచుకున్నట్టు విచారణలో తేలింది.

 

 

ఇక రామనాథపురం పోలీసులు ఈ నవ మన్మధుడికి తమదైన స్టైల్లో ట్రీట్‌మెంట్‌ ఇస్తూ, మరిన్ని విషయాల్ని రాబట్టే పనిలో నిమగ్నం అయ్యారట.. ఇకసమాజంలో ఇలాంటి నేరాలు ఎన్ని జరుగుతున్న మనుషులు కళ్ళుతెరుచుకోక మోసపోతుండటం విచారకరం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: