ప్రజలకు అండగా ఉంటూ, అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన పోలీసులు విధి నిర్వహణను పక్కన పెట్టి తన ఇష్టానుసారంగా చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో బయటకు వచ్చింది. అది కూడా వ్యభిచార కూపంలో ఇరుక్కుపోవడం ఒక బాలికను రక్షించాల్సిన విషయం మరిచి పోయి ఆమెతో ఏకాంతంగా వేరే ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక కోరికలు తీర్చుకునే విషయం ఇప్పుడు బయటకు రావడంతో నెల్లూరు జిల్లా పోలీసు యంత్రాంగం ఉలిక్కిపడింది. అయితే ఈ విషయం సంబంధించి ఉన్నతాధికారులు పూర్తి వివరాలను  బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


ఇక ఈ కేసులో పూర్తి వివరాల్లోకి వెళితే... నెల్లూరు నగరంలో ఉండే ఒక అపార్ట్మెంట్ లో ఒక మహిళ కొంతకాలంగా వ్యభిచార గృహం నడుపుతోంది. ఇకపోతే ఇటీవల ఆమె నిజామాబాద్ కు చెందిన ఒక అమ్మ మైనర్ బాలికను తీసుకు వచ్చిందని, ఆ విషయాన్ని తనకు పరిచయం ఉన్న ఆ ప్రాంత ఎస్ఐకి తెలియజేసింది. దీంతో ఎస్ఐ లో కామ కోరికలు కలిగి ఆ బాలికను శుక్రవారం నాడు బయటకు తీసుకు వెళ్లి లైంగిక కోరికలు తీర్చుకొని అనంతరం ఆమెను వ్యభిచార గృహానికి వెళ్లిపోవాలంటూ తన కారుని ఇచ్చి పంపించాడు. 


అసలు సంఘటన ఇప్పుడే జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి నెల్లూరు పట్టణంలో రాత్రి పూట గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ఆ కారును ఆపి అందులో ఉన్న బాలికను విచారించి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. దీనితో ఆ ఎస్సై నిర్వాహం కాస్త బయటికి వచ్చింది. అయితే ఈ సంఘటన జరిగింది వేరే పోలీస్ స్టేషన్ పరిధిలో కావడంతో ఆ బాలికను విచారణ నిమిత్తం సదరు పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. దీనితో పోలీస్ శాఖ పరువుకు సంబంధించిన విషయం కావడంతో ఉన్నత అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా విచారణ చేపడుతున్నారు. అయితే ఇక ఆ అమ్మాయిని తీసుకుని వ్యభిచార గృహం నిర్వహిస్తున్న అపార్ట్మెంట్ వద్దకు వెళ్లిన పోలీసులు ఆ నిర్వాహుకురాలును విచారించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: