నేడు విజయవాడలో మరో గ్యాంగ్ వార్ జరిగింది. ఇందులో ఒకరు మృతి చెందారు. పరస్పర దాడులలో ఒక వర్గానికి నాయకత్వంగా వహించిన తోట సందీప్ మృతి చెందడం జరిగింది. అంతేకాకుండా ఈ గ్యాంగ్ వార్ కు సంబంధించిన సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి రావడం జరిగింది. ముందుగా ఇరు వర్గాల పరస్పర దాడులు మొదట రెండు విద్యార్థి గ్రూపుల మధ్య వచ్చిన వివాదం అని అందరూ అనుకున్నారు.. ఆ తర్వాత ఈ వార్త మీడియాలోకి రావడం జరిగింది. దీనితో వివాదంలో సంచలన విషయాలు బయటకు రావడం జరిగాయి.

 


వాస్తవానికి రెండు కోట్ల విలువ గల స్థల విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది. ఒక స్థల సెటిల్మెంట్ విషయంలో తోట సందీప్, మణికంఠ వర్గాల మధ్య గొడవ సంభవించినట్లు అర్థమవుతుంది. ఇద్దరూ కూడా ఒకే స్థలం విషయంలో జోక్యం చేసుకోవడంతో వివాదం ఏర్పడిందని అర్థమవుతుంది. రెండు కోట్లు విలువైన స్థలాన్ని దక్కించుకునేందుకు హత్యలు చేసేందుకు రెండు వర్గాల వాళ్లు ప్లాన్ చేసినట్లు అర్థమవుతుంది. ఇక వారు అనుకున్న ప్లాన్ ను అమలు చేసేందుకు రాజి ముసుగులో రెండు గ్రూపులు సిద్ధమయ్యాయి. ఇక పోలీసు విచారణలో పక్క ప్లానింగ్ తోనే కత్తులు, కర్రలతో వారు రంగంలోకి దిగినట్లు సమాచారం. మొదట రెండు వర్గాల వారు కూడా చిన్నగా మాట్లాడుతూనే ఒక్కసారిగా ఒక వర్గం పై మరో వర్గం దాడులు మొదలుపెట్టారు.

 

 

ఇక అంతేకాకుండా కత్తులు, కర్రలతో దాడులు చేసుకుంటూ రాళ్లు విసురుకుంటూ ఆ ప్రాంతం అంతా కూడా బీభత్సంగా రెండు వర్గాల వారు దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరినొకరు కత్తులతో కూడా పొడుచు కోవడం జరిగింది. దీనితో  ఇద్దరు సందీప్, మరొకరు తీవ్రంగా గాయపడగా వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ఇక చికిత్సపొందుతూ సందీప్ అనే యువకుడు మరణించడం జరిగింది. ఇక ఈ దారుణానికి పాల్పడిన వారిపై సెక్షన్ 307 కింద పోలీస్ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే పోలీసు అధికారులు దాదాపు ఈ సంఘటనలో 30 మంది దాకా పాల్గొన్నట్లు గుర్తించడం జరిగింది. అలాగే ఈ దాడులలో పాల్పడిన వారి అందరి వివరాలు కూడా పోలీసు అధికారులు సేకరించే పనిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: