ఆ యువకుడికి యుక్త వయసులో ఉన్న మహిళలు, కొత్తగా పెళ్లి అయిన ఆంటీలు టార్గెట్. వారి ఫోటోలను మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడమే ఆ యువకుడి టార్గెట్. సరిగ్గా ఇరవై ఏళ్లు కూడా నిండని ఈ యువకుడి రాసలీలలు వ్యవహారానికి పులి స్టాప్ పడింది. పోలీస్ అధికారుల చేతికి అడ్డంగా బుక్కయిన విచారణలో ఆ యువకుడి ఖాతాలు పడిన ఆంటీలో చాలామంది ఉన్నారు. దీనితో పోలీస్ అధికారులు ఈ కేసును సిబిసిఐడి కి అప్పగించడం జరిగింది. ఆ యువకుడి ఆగడాలపై పిర్యాదులు చేయడం కోసం ఏకంగా ప్రత్యేక ఫోన్ నెంబర్ ను ఏర్పాటు చేయడమే విశేషంగా మారిందనే చెప్పాలి. 

 


పూర్తి వివరాల్లోకి వెళితే... రామనాథపురం పరమ గుడికి చెందిన ఒక ఉద్యోగి ఇటీవల తన భార్య ఫోటోలను ఒక యువకుడు మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అంతేకాకుండా 20 వేల రూపాయలు ఇవ్వకుంటే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడని ఆ ఉద్యోగి పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనితో ఎస్పీ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా 20 వేల రూపాయలు యువకుడికి ఇస్తున్నట్లు ఉద్యోగితో పంపించారు. తీసుకోవడానికి వచ్చిన ఆ యువకుడు అడ్డంగా పోలీస్ అధికారులు చేతులతో బుక్ అయిపోయాడు.

 


వారి విచారణలో అతడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 20 సంవత్సరాలు కూడా లేని ఈ విద్యార్థి ఉలగనాథపురానికి చెందిన వ్యక్తిగా పోలీస్ అధికారులు గుర్తించారు. ఆ యువకుడి ఫోన్ లో ఫేస్ బుక్, టిక్ టాక్, వాట్సాప్ ల ద్వారా యుక్తవయసులో ఉన్న మహిళలు, పెళ్లి అయిన మహిళలను టార్గెట్ చేస్తున్నాడని అర్థమయింది. ఇలా ఉండగా వారితో పరిచయాలు ఏర్పరచుకొని వారి ఫోటోలను మార్పింగ్ చేసి వారిని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి లొంగ తీసుకుంటాడు. అంతేకాకుండా వారిని లైంగికంగా వేధించేవాడు. మరికొందరు దగ్గరనుంచి నగదు కూడా దోచుకునట్లు విచారణలో వెల్లడైంది. అలాగే అతని సెల్ ఫోన్ లో మొత్తం మార్ఫింగ్ చేసిన ఫోటోలు కనిపించాయి. అంతేకాకుండా మహిళలతో బెదిరింపు మెసేజ్ లు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: