సైబర్ నేరగాళ్లు రోజుకు ఒక కొత్త స్కీమ్ తో ప్రజల్ని మోసం చేస్తూ వాళ్ల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. చాలా తక్కువ ధరకు ఫోన్ లు, లాప్ టాప్ లు ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ సామాన్లు ఇస్తామంటూ వారిని నమ్మించి నట్టేట ముంచే చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ముఖ్యంగా వినియోగదారుల బలహీనతలను వారు సొమ్ము చేసుకుంటున్నారు. ఆన్లైన్లో లో కాస్త తక్కువ ధర అంటే చాలు ఎగబడి కొనేవారిని నిలువునా లక్షల్లో ముంచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

 

ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు చాలా ఎక్కువ అయ్యాయి. అతి తక్కువ ధరలకే పెద్ద కంపెనీల ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అంటూ ప్రచారం చేసి ఆశపడిన వారితో ముందుగా కొద్దిగా డబ్బులు అడ్వాన్స్ గా ఇప్పించుకుని ఆ తర్వాత మీద పూర్తిగా చెల్లించాలని చెబుతున్నారు. ఇక అలా నగదును బదలాయింపు చేసుకున్న తర్వాత నకిలీ ఇన్వాయిస్ ను తయారు చేసి వారికి చూపించి మిగతాది చెల్లించాలి అంటూ మిగతా సొమ్మును లాగేస్తారు. ఆ తర్వాత మళ్లీ కొరియర్ బాయ్స్ లా ఫోన్ చేసి పార్సల్స్ ను కస్టమ్ అధికారులు పట్టుకున్నారని కొంత ట్యాక్స్ కట్టాలి అని చెప్పి మరి కొంత డబ్బు అలాగే లాగేవాళ్ళు కూడా లేకపోలేదు.

 


ఇదంతా మీరు మోసపోతున్నారు అని తెలుసుకునే లోపల మీ దగ్గర నుంచి వారు పూర్తిగా డబ్బులు దండుకుని వేసుకుంటారు. కాబట్టి ఇలాంటి జిముక్కులకు ఆశపడి మీ ధనాన్ని వృధా చేసుకోవద్దని పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఇంకొందరు కొన్ని లింకులు పంపించి ఈ ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ప్రోమో కోడ్ వస్తుంది, దాన్ని ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ లభిస్తుంది అని అనేక రకాల స్పామ్ అప్లికేషన్లను ఫోన్ లో ఇన్స్టాల్ చేసి హ్యాకింగ్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కాస్తా ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీ జేబులు ఖాళీ అయిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: