ఆ యువకుడు కష్టపడి చదివి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకున్నాడు. ఉద్యోగంలో చేరి విధులు నిర్వహించేందుకు వెళ్తున్న మార్గమధ్యంలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆ యువకుడికి యాక్సిడెంట్ రూపంలో మృత్యు వెంట రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక ఆ యువకుడు తల్లిదండ్రులు కు పెద్దయి కొడుకు చేదోడువాదోడుగా ఉంటాడు అని భావించరు. కానీ అంతలోకే కొడుకు మరణ వార్త విని తల్లిదండ్రులు షాక్ కి గురి అవ్వడం జరిగింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ప్రమాద సంఘటన మటుకు గుంటూరులో జరిగింది.

IHG

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెంకి చెందిన గణేష్ అనే యువకుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకున్నాడు. పోస్టల్ శాఖలో అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ పోస్టుకి ఎంపిక కావడం జరిగింది. నెల్లూరు జిల్లాలో పోస్టింగ్ రావడంతో గణేష్ ఉద్యోగంలోకి చేరేందుకు గుంటూరు నుంచి బైక్ పై బయలుదేరడం జరిగింది. ఇక ప్రకాశం జిల్లా టంగుటూరు పరిధిలో సూరారెడ్డి పల్లె వద్ద గణేష్ వెళ్తున్న బైక్ అదుపుతప్పి జాతీయ రహదారిపై ఉన్న ఫ్లై ఓవర్ ఢీ కొట్టడం జరిగింది. దీనితో గణేష్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

 


వేగంగా వెళ్తున్న బైక్ సడన్ గా ఫ్లై ఓవర్ ని ఢీకొట్టడంతో గణేష్ తీవ్రగాయాలు అయ్యి అక్కడికక్కడే మరణించాడు. ఇక సంఘటన విషయాన్ని తెలుసుకున్న టంగుటూరు పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించడం జరిగింది. వెంటనే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక ఉద్యోగంలో చేరేందుకు వెళ్తున్న యువకుడు మరణించడంతో గణేశ్వర గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: