మహిళలు ఉదయం లేచినప్పటి నుంచి పడుకొనే వరకు ఏదోక సమస్యలను ఎదుర్కొంటున్నారు..మహిళలను రక్షించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చట్టాలను అమలు చేస్తున్నారు.. అయిన కూడా కామందులలో ఎక్కడ మార్పు రాలేదు.. లేనిపోని విధంగా కామ కోరికలతో రెచ్చిపోతూ వావి వరుసలు లేకుండా మరచిపోతున్నారు..స్నానం చేస్తూ ఉన్న ఓ చిన్నారి వీడియో ను తీసి బెదిరించి దారుణంగా రేప్ చేసి గర్భవతిని చేశాడు.. 

 

 

 

వివరాల్లోకి వెళితే..బాలికపై జరిగిన కీచకపర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చీపురుపల్లిలో బాలిక స్నానం చేస్తుండగా ఓ యువకుడు ఫొటోలు తీసి, వాటితో ఆమెను బెదిరించి లైంగికంగా లోబరుచుకుని గర్భవతిని చేశాడు. పట్టణానికి చెందిన 14 ఏళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు కన్నేశాడు. ఆమె స్నానం చేస్తున్న సమయంలో సెల్‌ఫోన్లో వీడియోలు, ఫోటోలు తీశాడు. వాటిని ఆమెను చూపించి తన కోరిక తీర్చకపోతే బయటపెడతానని బెదిరించాడు. తన పరువు కాపాడుకునే పరిస్థితుల్లో బాలిక అతడికి లొంగిపోయింది. దాన్ని అవకాశంగా చేసుకున్న ఆ కామాంధుడు బాలికపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

 

 

 


ఈ ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆమె తన కూతురిని హాస్పిటల్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయించగా రెండు నెలల గర్భవతి అని తేలింది. దీంతో ఆమె చీపురుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం బొబ్బిలి ఇన్‌ఛార్జి డీఎస్పీ పాపారావు.. సీఐ రాజులనాయుడు, ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌లతో కలిసి గ్రామానికి చేరుకొని విచారించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.మరో విషయమేంటంటే డిఎస్పీ నే డీల్ చేస్తున్నట్లు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: