కామంతో కొట్టుకుంటున్న వాడికి వావి వరసలతో సంబంధం లేదు.. కడుపుకు ఆకలేస్తే, ఏదిపడితే అది తిని వారి ఆకలి తీర్చుకుంటున్నారో, అలాగే కామాంధులు కూడా శరీరానికి కోరిక కలిగితే ఇలాగే ప్రవర్తిస్తున్నారు.. చిన్నప్పటి నుండి కళ్ల ముందు పెరిగిన వారిని కూడా వరసలు మరచి వాంచిస్తున్నారు.. లోకంలో రోజు రోజుకు యువతులపై అఘాయిత్యాలు పెరిగిపోతుండటం, కంటిపాపలను కూడా కాటేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు దుర్మార్గులు. ఈ విషయం ఒకరకంగా ఆందోళన కలిగించే అంశం.. ఇక వైజాగ్ లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది..

 

 

ప్రేమతో బాబాయ్ పిన్ని అని ఇంటికి వచ్చిన యువతిపై, ఆ బాబాయ్ అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ నేరం తాలూకు ముచ్చట చూస్తే.. విజయవాడకు చెందిన 19 సంవత్సరాల యువతి గత ఏడాది ఆగష్టులో వైజాగ్ లోని తన పిన్ని ఇంటికి వెళ్ళి నాలుగు నెలలు అక్కడే ఉన్నది. ఆ సమయంలో వరసకు బాబాయి అయ్యే వ్యక్తి ఈ యువతిపై  కన్నేశాడు..

 

 

ఒక టైంలో ఈ యువతి పిన్ని బయటకు వెళ్లిన సమయంలో, మాయమాటలతో లోబరుచుకోవడమే కాదు అనేకమార్లు యువతిపై అత్యాచారం కూడా చేశాడు. ఇక నాలుగు నెలల తరువాత విజయవాడ వచ్చిన ఆ యువతి ఆరోగ్యంలో మార్పులు వస్తూ, అనారోగ్యంపాలు అవడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ తీసుకెళ్లగా అక్కడ పరీక్ష నిర్వహించిన వైద్యులు సదరు యువతి గర్భవతి అని తేల్చడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు.

 

 

వెంటనే ఆ యువతిని నిలదీయగా వైజాగ్ లో జరిగిన దారుణం గురించి వివరించిందట, దీంతో తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చూసారా ఈ కాలంలో ఆడపిల్లలను ఎవరింటికి పంపినా వారికి సెక్యూరిటీ లేదు.. ఏ బంధువుని నమ్మకండి. ఒంటరిగా ఇంట్లో కూడా ఉండనీయకండి. ఏమో చెప్పలేము. కామాంధులు ఏ రూపంలో తిరుగుతుంటారో అంచనా వేయడం కష్టం కదా..

మరింత సమాచారం తెలుసుకోండి: