బిడ్డ పుట్టినప్పటి నుండి వారు పెరిగి ప్రయోజకులు అయ్యే వరకు ఆ తల్లి పడే కష్టం మాటల్లో వర్ణించలేము.. తండ్రి సంపాదనకోసం బయటకు వెళ్లితే తన చంటి పిల్లలను కంటి పాపలకంటే ఎక్కువగా కాపాడుతుంది మాతృమూర్తి.. కానీ నేడు అమ్మ అంటే అంగట్లో బొమ్మలా మారింది.. ఎంత మందినైనా తన కడుపున మోసి జన్మనిచ్చిన అమ్మకు ఒక్కడైనా సాకలేని పరిస్దితుల్లో ఈ నాటి వ్యవస్ద ఉంది.. తన బిడ్దకు చిన్న దెబ్బ తగిలే కన్నీరు కార్చే తల్లులున్న లోకంలో, ఆ తల్లి గుండెకు ఎన్నో గాయాలు చేస్తున్న పిల్లలు ఒక్కోసారి మానవత్వం మరచి కౄరంగా ప్రవర్తిస్తున్నారు.. అమ్మ అంటే ఆది దేవత అనే విషయాన్ని గుర్తించ లేక తల్లిని భారంగా భావిస్తున్నారు..

 

 

ఇక ఒక దుర్మార్గుడు మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదనే కోపంతో కన్నతల్లినే చంపేశాడు.. ఇక ఆ కర్కోటకుడి పేరు లక్ష్మీనారాయణ. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని గంగానమ్మపేటలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన గురించి తెలుసుకుంటే.. తెనాలికి చెందిన శశీదేవి (65) భర్త గతంలోనే మృతి చెందడంతో, ఆమె తన కుమారుడు లక్ష్మీనారాయణ కుటుంబంతో కలిసి ఉంటోంది. కాగా భార్య నలుగురు పిల్లలున్న అతను మద్యానికి బానిసై అతని కుటుంబాన్ని పట్టించుకునే వాడు కాదట.. అయితే ఇతని తల్లినే తోపుడుబండిపై ప్లాస్టిక్‌ సామాన్లను విక్రయించి లక్ష్మీనారాయణ పిల్లల ఆలనాపాలనా చూసేదట..

 

 

ఈ క్రమంలో రాత్రి మద్యం తాగడానికి డబ్బు కావాలని తల్లిని అడగ్గా ఆమె డబ్బులు తన దగ్గర లేవని చెప్పడంతో మద్యం మత్తులో ఉన్న అతను విచక్షణ మరచి తల్లి మెడపై కత్తితో నరికేసి పారిపోయాడట.. పాపం తనకు కొడుకు చేసిన గాయం చిన్నదే అనుకున్న ఆ పిచ్చి తల్లి ఒక గుడ్డను మెడపై అడ్డం పెట్టుకుని ఒంటరిగా ఇంటి నుంచి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు బయలుదేరగా, తోడుగా ఆమె కోడలు కూడా అత్త వెంట పోలీస్‌స్టేషన్‌కు చేరింది.

 

 

ఇకపోతే అప్పటికే తీవ్ర రక్తస్రావంతో తడిసిన ఆ వృద్ధురాలిని పోలీసులు వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స అందిస్తుండగానే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లింది.. కొడుకును కన్నందుకు అతను ఇచ్చిన బహుమతి తల్లికి మరణం.. ఇలాంటి వారు బ్రతకడం అవసరమా అని అంటున్నారు నెటిజన్స్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: