ఆడవాళ్ళు అన్నిట్లో సమానం అనేది ఇప్పుడు నిరూపితం అవుతుంది.. మగవాళ్ళను మించిన రేంజులో ఆడవాళ్ళు దొంగతనాలు, దోపిడీలు చేయడమే కాకుండా తెలివి తేటలను ప్రదర్శించి మరి మగాళ్ళను ముగ్గులోకి దించుతున్నారు.. అలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే వెలుగు చూశాయి.  తాజాగా ఇప్పుడు మరో ఘటన అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది.. 

 

 

 

వివరాల్లోకి వెళితే.. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌‌గా పనిచేస్తున్న యువకుడిని మోసం చేసిన కేసులో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు మాళవిక అనే మహిళను అరెస్ట్ చేశారు. అందమైన అమ్మాయిల ఫోటోలతో ఫేక్ ఫ్రొఫైల్స్ క్రియేట్ చేసి ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగలిగే ఆమె ఇప్పటివరకు ఎందరో యువకులను వలలో వేసుకుని డబ్బులు దోచుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

 

 

భారత్ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లో పెళ్లి కోసం ప్రకటనలు ఇవ్వడం, ప్రొఫైల్ చూసి స్పందించిన వారికి మాయమాటలు చెప్పి మోసం చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. 2014లో నుంచి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న మాళవికను గతంలోనే అనేకసార్లు అరెస్టయి.. బెయిల్‌పై బయటకు వచ్చింది. అయినప్పటికీ ఇలాంటి మోసాలకు మాత్రం మానుకోలేదు.

 

 

 

 

తాజాగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వరుణ్ అనే యువకుడి నుంచి ఏకంగా రూ.65లక్షలు కొట్టేసింది మాళవిక. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లో ప్రొఫైల్ చూసి స్పందించిన వరుణ్‌కు తాను హైదరాబాద్‌లో పెద్ద డాక్టర్‌ని అని, గతంలో కొంతకాలం అమెరికాలోనూ పనిచేశానని చెప్పింది. తన ఆస్తికి సంబంధించి ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకునేందుకు డబ్బు అవసరం ఉందని చెప్పడంతో వరుణ్ అనేక విడతలుగా రూ.65లక్షల వరకు ఆమె అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అయితే ఎంత కాలమైనా డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో నిలదీయగా కట్టుకథలు చెబుతూ వచ్చింది.పోలీసులు రంగంలోకి దిగడంతో అన్నీ సమస్యలు సర్డుమనిగాయి... ఆమెను ఆమె కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: