ఆడవాళ్ళు అన్నిట్లో సమానం అనేది ఇప్పుడు నిరూపితం అవుతుంది.. మగవాళ్ళను మించిన రేంజులో ఆడవాళ్ళు దొంగతనాలు, దోపిడీలు చేయడమే కాకుండా తెలివి తేటలను ప్రదర్శించి మరి మగాళ్ళను ముగ్గులోకి దించుతున్నారు.. అలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే వెలుగు చూశాయి.  తాజాగా ఇప్పుడు మరో ఘటన అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది.. 

 

 

 

వివరా ల్లోకి వెళితే.. మోసగాళ్ళు అనేది ఇప్పుడు ఆడ వాళ్ళు కూడా ఎక్కువ గా ఉన్నారు.మహా ముదుర్లు అని చెప్తున్నారు.ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు పరిచయమైన ఓ మాయలాడి అతడిని నిండా ముంచేసింది. అతడి నుంచి ఏకంగా రూ.3.63 లక్షలు కొట్టే సింది. చివరికి వేధింపులు శ్రుతి మించడంతో తట్టుకోలేని బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల కథనం ప్రకారం.. ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న సాఫ్ట్ ‌వేర్ ఇంజినీర్‌ కు ఇటీవల ఇన్‌స్టాగ్రాం ద్వారా ఓ యువతి పరిచయం అయింది. అది క్రమంగా స్నేహంగా మారి మరింత ముదిరింది. తర్వాత ఇద్దరూ పరస్పరం ఫొటోలను మార్చుకున్నారు.

 

 

 


ఆ తర్వాత మరింత ముందుకెళ్లి ఇద్దరూ నగ్న వీడియోలను షేర్ చేసుకున్నారు. అతడి నగ్నవీడియోలు ఆమె చేతిలో పడిన వెంటనే ఆమె తన ప్లాన్‌ను అమలు చేసింది. తనకు డబ్బులు ఇవ్వకుంటే తన దగ్గర ఉన్న నగ్న వీడియోలను కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆఫీసులోని ఉద్యోగులకు పంపుతానంటూ బెదిరించింది. దీంతో ఆమె చెప్పినట్టు చేయకతప్పలేదు. వారం రోజుల్లో ఏకంగా రూ. 3.63 లక్షలు ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. తాజాగా, మరో రూ.10 లక్షలు డిమాండ్ చేయడంతోనమోదు చేసుకున్న పోలీసులు మాయలాడి కోసం గాలిస్తున్నారు.జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పుకొచ్చారు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు...

మరింత సమాచారం తెలుసుకోండి: