ఉదయం లేచినప్పటి నుంచి పడుకొనే ముందు వరకు వినిపించే ఒకే ఒక్క పేరు కరోనా... కంటికి కనిపించని ఒక వైరస్.. చూడటానికి చాలా చిన్నది అని అనుకోకండి..దీని వల్ల ప్రజలు నిద్రపోకుండా బ్రథుకున్నారు. తినడానికి తిండి లేక కొందరు అలమటిస్తున్నారు.. అయితే కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది.. అదేంటంటే జన సాంద్రత ఎక్కువగా కనిపించకుండా చేయాలనే ఆలోచనలో ఉన్నారు.. లాక్ డౌన్ విధించి ప్రజలను ఇళ్లకే పరిమితమయ్యే లా చేశారు.. 

 

 

అసలు విషయానికొస్తే .. మూఢ నమ్మకాల ముసుగు లోనే జనాలు ఉండిపోతున్నారు. ఈ వ్యాధిని నయం చేసే వ్యాక్సిన్ తయారీ కోసం సైంటిస్టులు, పరిశోధకులు రేయింబవళ్లు కష్టపడుతుంటే.. మరికొందరు మాత్రం ఇది చేస్తే కరోనా పోతుంది... అది తాగితే కరోనా రాదన్న భ్రమల్లో బతుకుతున్నారు. అయితే తాజాగా ఓ అర్చకుడు కరోనా వైరస్ పీడ పోవాలని నరబలి ఇచ్చిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ దారుణ సంఘటన ఒరిస్సా రాష్ట్రంలో వెలుగు చూసింది. కటక్ జిల్లా నర్సింగ్ పూర్ లో బ్రాహ్మణిదేవి ఆలయంలో నరబలి ఇచ్చారు. కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలగాలని ఆలయ అర్చకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన తెలిసి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అర్చకుడు సంసారి హోజాను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

 

 


ఈ క్రమంలో కరోనా వైరస్ పోవాలంటూ ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ జిల్లా నర్సింగ్ పూర్‌లో బ్రాహ్మణిదేవి ఆలయంలో ఓ అర్చకుడు నరబలి ఇచ్చారు. కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలగాలని ఆలయ అర్చకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. బంధ్ మా బుధ్ బ్రహ్మణి ఆలయం పరిసరాల్లో ఈ ఘటన జరిగింది. ఆలయ పరిసర ప్రాంతంలోనే పూజారి నరబలి ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అర్చకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు ఎవర్ని నరబలి ఇచ్చాడన్న విషయాలు మాత్రం ఇంకా తెలియలేదు.ఈ ఘటన పై విచారణ జరిపించి త్వరాలనే నివేదిక సమరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు...

మరింత సమాచారం తెలుసుకోండి: