దేశం ఎంత అభివృద్ది చెందుతుంది అనేది పక్కన పెడితే.. సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. డబ్బున్న వారిని టార్గెట్ చేస్తూ వారి  ఫోన్, సిస్టమ్,బ్యాంక్ అకౌంట్ లను హ్యాక్ చేస్తూ ఉన్న డబ్బును స్వాహా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది సైబర్ నేరగాళ్ల వల్ల డబ్బులను పోగొట్టుకున్నారు.అసలు విషయానికొస్తే.. ఓ యువకుడి  బ్యాంక్‌ అకౌంట్‌లో నుంచి రూ. 11.30 లక్షలు మాయమైన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. 

 


ప్రకాశం జిల్లా కు చెందిన కిషోర్‌ హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌లో ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం అతడి సెల్‌ఫోన్ ఉన్నట్టుండి స్విచ్ఛాఫ్‌ అయింది. దాదాపు అరగంట వరకు ఫోన్‌ ఆన్‌ కాలేదు. ఆ తర్వాత ఫోన్‌ ఆన్ చేసి చూస్తే అందులోని చాలా యాప్‌లు డిలీట్‌ అయ్యాయి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌ చేసేందుకు ఉపయోగించే ‘యూనో’ యాప్‌ కూడా డిలీట్‌ అయి పోయింది.అనుమానం రావడంతో ఫోన్ ను లో బ్యాలెన్స్ చెక్ చేయడానికి ట్రై చేసాడు. కానీ అందుకు సంబంధించిన యాప్ లు డిలీట్ కావడంతో షాక్ కు గురయ్యాడు..

 

 


వెంటనే ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పాడు.. అంతేకాకుండా అతన్ని బ్యాంక్ కు వెళ్లి జరిగిన అకౌంట్ వివరాలను కనుక్కోమన్నాడు.. వెంటనే బ్యాంక్ వెళ్ళిన తండ్రి కొడుకు చెప్పినట్లుగా అకౌంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు..బ్యాంక్ వాళ్ళు అందించిన వివరాల ప్రకారం 4 దఫాలుగా రూ.11.30 లక్షలు అకౌంట్ నుంచి డ్రా అయినట్లు తెలిసింది. ఆ డబ్బు మొత్తం అఖిల ఆనే మహిళ పేరిట డ్రా అయిందని, దానితో కొన్ని విలువైన వస్తువులు కొన్నట్లుగా బ్యాంక్ అధికారులు తెలిపారు. దీంతో వంశీ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసలు దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: