బ్యాంకులను మోసం చేయడంలో పీహెచ్‌డీ చేసినట్లున్నారు కొందరు.. ఎందుకంటే బ్యాంకువారు నిండా మునిగాము అని తెలిసే లోపలే తట్టాబుట్టా సర్దేసుకుని మోసగాళ్లూ విదేశాలకు చెక్కేస్తున్నారు.. మరి ఇలాంటి కేటుగాళ్లూ చేసే మోసాలను బ్యాంకు వారు కళ్లుమూసుకుని చూస్తున్నారనుకుంటా.. ఇది వరకే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి ప్రభుద్దులు వేలకోట్ల రూపాయలను ఆనకొండలా మింగేసారు.. ఇప్పటికి ఈ ఆర్ధిక నేరగాళ్ల నుండి ఒక్క పైసా కూడా వసూలు చేయలేకపోయారు, అదీగాక వీరిని అరెస్ట్ చేయలేక పోయారు..

 

 

ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని మరో బిజినెస్‌మ్యాన్ బ్యాంకులకు గట్టిగానే బొక్క వేసాడు.. ఇకపోతే ఇతను విదేశాలకు వెళ్లిపోయిన రెండేళ్ల తర్వాత ఈ కుంభకోణం వెలుగుచూడటం దురదృష్టకరం.. ఆ వివరాలు చూస్తే.. పంజాబ్ బాస్మతి రైస్ సంస్థ డైరెక్టర్ మంజీత్ సింగ్ మాఖ్ని ఇటీవల విదేశాలకు వెళ్లిపోయాడు. అయితే ఈ నేరగాడు విదేశాలకు వెళ్లే ముందు కెనరా బ్యాంకు కన్సార్షియంలోని ఆరు బ్యాంకుల నుంచి సుమారుగా రూ.350 కోట్ల ధనాన్ని అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత ఇతని దగ్గర ఉన్న ధాన్యం నిల్వలు, బ్యాంకులో ఇచ్చిన సెక్యూరిటీని సదరు బ్యాంకులకు సమాచారం కూడా ఇవ్వకుండా మాయంచేశాడు..

 

 

ఈ క్రమంలో ఇతను  దేశం విడిచి వెళ్లాక బయటపడ్డ విషయం తెలిసి అందరూ షాకయ్యారు. ఇక ఈ విషయాన్ని సీబీఐ శుక్రవారం వెల్లడించింది. కాగా మంజీత్‌పై కేసు నమోదు చేసుకున్న సీబీఐ దర్యాప్తు చేస్తోంది.. చూశారా ఇలాంటి వారు మోసం చేస్తే ఆ డబ్బులను తిరిగి రాబట్టుకోలేని బ్యాంకులు, ఒక సామాన్య రైతు తన ఋణం తాలుకు డబ్బుల్లో రూపాయి తక్కువైనా అతన్ని ముప్పతిప్పలు పెడుతుంది.. నడిరోడ్డులో నిల్చోబెట్టి, చివరికి అతని ప్రాణాలు పోయేలా ప్రవర్తిస్తుంది.. అయినా గాని అతనికిచ్చిన ౠణాన్ని వసూలు చేసుకుంటుంది..

 

 

కానీ ఇలాంటి వెధవలు వేయిల కోట్లు ముంచిపోయినా కనీసం వారు వేసుకున్న కోటు గుండి కూడా పీకలేరు.. ఇక ఇలా ముంచిన నేరస్దుల నుండి ఆ డబ్బులు రాబట్టుకుని సైనిక సంక్షేమం కోసం, రైతు బ్రతుకు కోసం ఇలాంటి డబ్బులు ఖర్చుపెడితే నిజంగా దేశం గర్విస్తుంది.. ఎందుకంటే వీరిద్దరు లేకుంటే అసలు దేశమే ఉండదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: