చేసుకున్న పాపపుణ్యాలు ఎక్కడికి పోవని లోకంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు నిరూపిస్తున్నాయి.. ఇతరులపట్ల మర్యాదతో మెదులుతూ, గౌరవంగా బ్రతికే జీవితం ఎంతో నయం. అలా కాదని అంతులేని కోరికలతో ఇతరుల జీవితాలను చిన్నాభిన్నం చేయాలని చూసిన వారు మట్టిలో కలిసిపోతున్నారు.. ఇన్ని జరుగుతున్నా మానవులం అని చెప్పుకుంటున్న సిగ్గులేని దరిద్రులు ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు.. లోకంలో ఇప్పుడు మంచిమాటలు చెప్పడం వరకే పరిమితం అయ్యాయి.. ఆచరించడానికి మాత్రం పనికి రావడం లేదు.. పైకి నవ్వుతూ నటిస్తారు, లోపల మాత్రం కుట్రలు పెట్టుకుని ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు.. అందుకే కరోనా లాంటి రోగాలు వచ్చి మనుషులు కుక్క చావు చస్తున్నా సిగ్గు శరం రావడం లేదు..

 

 

ఇకపోతే రోజు రోజుకు మానవ సంబంధాలు మంటకలిసి పోతున్నాయి అనడానికి లోకంలో జరుగుతున్న నేరాలే సాక్ష్యాలు.. ఇలాంటి ఒక ఘోరం తమిళనాడులోని కావేరి పట్టణంలో చోటు చేసుకున్నది.. వరుసకు పిన్ని అయ్యే ఆవిడతో వివాహేతర సంధం పెట్టుకుని చివరికి అనుమానంతో హతమార్చిన యువకున్ని పోలీసులు అరెస్ట్ చేశారు..

 

 

ఈ ఘటన వివరాలు పరిశీలిస్తే.. కృష్ణగిరి జిల్లా కావేరి పట్టణం సమీపంలోని పొత్తపురమ్‌ మణిమాడికొట్టాయి ప్రాంతానికి చెందిన మలర్‌ (38) అనే మహిళ భర్త మృతి చెందగా, అప్పడాలు తయారుచేసి విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తుంది.. ఈ క్రమంలో బయటకు వెళ్లిన మలర్‌ ఎంత రాత్రి అయినా గానీ ఆమె ఇంటికి చేరలేదు. దీంతో ఆమె దగ్గరి బంధువులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. కాగా మొన్న శనివారం పొత్తాపురం సమీపంలోని కాలువలో మలర్‌ శవంగా పడి ఉండడాన్ని గమనించిన స్దానికులు పోలీసులకు సమాచారం అందించారు..

 

 

అక్కడికి చేరుకున్న కావేరి పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదుచేసి విచారణ చేపట్టగా మృతురాలికి, ఆమె బంధువు అయిన గాంధీ (28)కి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. దీంతో గాంధీని పట్టుకుని విచారించగా, మలర్‌ నాకు పిన్ని వరస అవుతుంది, అయినా ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

 

 

అయితే కొన్ని రోజుల ముందు మరోకరితో సన్నిహితంగా ఉండటం కనిపించింది.. ఈ విషయంలో మా మధ్య గొడవ కూడా జరిగింది. కాగా ఈ ఘటన జరిగిన రోజు రాత్రి మద్యం మత్తులో ఉన్న నేను క్వార్టర్‌ బాటిల్‌ను పగులగొట్టి ఆమె తలపై పొడిచి హత్య చేసి, ఆమెను కాలువలో పడవేసి పారిపోయానని తెలిపాడు.. ఇంకేం ఉంది.. ఆ శవం శ్మశానానికి, ఇతను జైలుకు.. ఇదే క్షణికమైన ఆవేశం చేస్తున్న నేరం.. ఇది గ్రహించక జీవితాలు పాడు చేసుకుంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: