దేశంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సైబర్ దాడులకు విదేశీ హ్యాకర్లు కుట్రలు చేస్తున్నట్లు నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మరి ఈ సైబర్ దాడుల వలలో పడకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదైనా నష్టం వాటిల్లితే? ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఏమైనా మార్గాలు ఉన్నాయా? సైబర్ పాలసీల్లో ఇలాంటి నష్టాలకు బీమా లభిస్తుందా? ఈ సందేహాన్నింటికీ సమాధానాలు మీకోసం..

కొత్త కొత్త టెక్నాలజీలు సహా ఇంటర్నెట్ ప్రస్తుతం ప్రజల జీవితాల్లో భాగమయ్యాయి. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం చాలా అవసరాలకు ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరి అయ్యింది.

షాపింగ్, వినోదం, ఆర్థిక లవాదేవీలు, డేటా స్టోరేజి, చదువు​ వంటి అవసరాలకు ఇంటర్నెట్​ అధారిత సాధానాలను వాడటం సర్వసాధారణ విషయమైపోయింది. కరోనా వల్ల ఇటీవల వర్క్​ ఫ్రం హోం వంటివి పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైబర్​ దాడులకు అవకాశాలు కూడా భారీగా పెరిగాయి.ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్​టీ-ఇన్) కూడా ఇదే విషయం చెప్పింది. ఇటీవల ఇంటర్నెట్​ వినియోగం, ఆన్​లైన్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా 20 లక్షల కంప్యూటర్లపై సైబర్ దాడులు జరగొచ్చని.. జూన్​ 9న హెచ్చరించింది. కరోనా సంక్షోభంలో ప్రభుత్వం నుంచి సహాయమందించే నెపంతో ఈ దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.

 

 

ఇలాంటి దాడుల్లో డబ్బు కోల్పోవడం, డేటా చోరీ అవ్వడం వంటివి జరిగితే? వాటి నుంచి వచ్చే నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలి? అని అలోచించారా? అవును ఇలాంటి నష్టాలు వచ్చినా కూడా మీపై భారం పడకుండా చూసుకునేందుకు అవకాశాలున్నాయి. వ్యక్తిగత సైబర్ సెక్యూరిటీ పాలసీలతో అది సాధ్యమవుతుంది.సైబర్ దాడిలో ఏదైనా ఆర్థిక నష్టం జరిగితే తిరిగి వాటిని రికవరీ చేసుకునేందుకు ఉపయోగపడేదే సైబర్ సెక్యూరిటీ పాలసీ. 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులు.

 

ఆన్​లైన్​లో ఎక్కువ కొనుగోళ్లు, ఆర్థిక లావాదేవీలు చేసే వారంతా ఈ పాలసీ తీసుకోవడం మంచిదే. వివిధ పేమెంట్ యాప్​లు, క్లౌడ్ ఆధారిత సర్వీసులు, హోమ్​ అసిస్టెంట్ వంటివి వినియోంచేవారు కూడా ఈ పాలసీని తీసుకోవడం ఉత్తమం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: