చనిపోయిన వ్యక్తి బతికిరావడం అపుడపుడు వింటూనే ఉన్నాం. కానీ చనిపోయాడు అనుకున్న వ్యక్తి బతికి మళ్ళీ చనిపోయిన ఘటన తమిళనాడు లో చోటు చేసుకుంది. పొరపాటున చనిపోయాదని ప్రకటించి మార్చురీ ఫ్రీజర్‌లో ఉంచిన 74 ఏళ్ల భారతీయ వ్యక్తి బయటకు తీసిన తరువాత మరణించాడు. బాలసుబ్రమణ్యం అనే వ్యక్తిని తమిళనాడులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడు సోమవారం చనిపోయినట్లు ప్రకటించి ఫ్రీజర్‌లో ఉంచారు. అంత్యక్రియల కోసం అతని మృతదేహాన్ని తీసుకువెళ్లాడనికి వచ్చిన కుటుంబ సభ్యులు అతను వణుకుతున్నారని చనిపోలేదని గ్రహించి అతన్ని తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లారు, కాని శుక్రవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.


రోగిని మత్తు స్థితిలో ఉంచి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో మరణించారని దక్షిణ సేలం ప్రభుత్వ ఆసుపత్రి డీన్ డాక్టర్ బాలాజినాథన్ చెప్పారు. మిస్టర్ బాలసుబ్రమణ్యం ఫ్రీజర్ లోపల ఎన్ని గంటలు గడిపాడో స్పష్టంగా తెలియదని ఆయన అన్నారు. అతను సోమవారం చనిపోయినట్లు ప్రకటించిన తరువాత, అతని కుటుంబం అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్ళి, ఫ్రీజర్ పెట్టెను పంపమని స్థానిక సంస్థను పిలిచింది. మంగళవారం వారు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు బంధువులకు సమాచారం ఇచ్చారు.అతను నాడీ సంబంధిత సమస్యల తో బాధపడ్డాడని కుటుంబ సభ్యులు అన్నారని పోలీసు చీఫ్ చెప్పారు.


బాలసుబ్రమణ్యం కుటుంబం వద్ద ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ లేదని సేలం పోలీసు చీఫ్ సెంథిల్ కుమార్ తెలిపారు. "డాక్టరుపై అపాయం కలిగించేలా దురుసుగా వ్యవహరించినందుకు" వారి కుటుంబంపై కేసు నమోదు చేశారు. బాలసుబ్రమణ్యం తన భార్య, ఇద్దరు కుమార్తెలు మరియు అతని సోదరుడితో కలిసి ఉండేవారు. ఇది ఇలా ఉండగా అతను పెట్టె లోపల గడ్డకట్టే ఉష్ణోగ్రత ల నుండి ఎలా బతికి బయటపడ్డాడో ఎవరికి అంతు చిక్కడం లేదు - దీంతో అతను మొదట చనిపోయినట్లు ప్రకటించిన ప్రైవేట్ ఆసుపత్రి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారా లేదా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: