గత రెండు రోజుల నుంచి తెలంగాణాలో జర్నలిస్ట్ కుమారుడి కిడ్నాప్ వ్యవహారం కాస్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అసలు దోషులు ఎవరు ఏంటీ అనే దాని మీద అందరూ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. జర్నలిస్ట్ కుమారుడి కిడ్నాప్ కేసులో లో వెలుగు చూస్తున్న కొత్త కోణాలు కేసుని కొత్త మలుపులు తిప్పుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు, అక్రమ సంబందాలపై బంధువులను ఆరా తీస్తున్నారు పోలీసులు. కిడ్నాఫర్ల ఫోన్ కాల్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రతి ఫోన్ కాల్ కు కిడ్నాఫ్ ఉదంతం మలుపు తిరుగుతుంది.

తాజా ఫోన్ కాల్ లో డబ్బులను ఆన్లైన్లో బదిలీ చేయాలని డిమాండ్ చేసారు. లేదంటే బాబు ప్రాణానికి హాని కలిగిస్తామని హెచ్చరికలు చేసారు. 8 ప్రత్యేక బృందాలతో మానుకోటను పోలీసులు గాలిస్తున్నారు. బాలుడి కిడ్నాఫ్ వ్యవహారంలో వివిధ కోణాల్లో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తులో ఎప్పుడు ఏ విషయం వెలుగులోకి వస్తుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు కిడ్నాపర్ లు. ఆర్థిక లావాదేవీలు, బంధువుల మధ్య విబేధాలపై ఆరా తీస్తున్నారు.

ఇప్పటివరకు 8 సార్లు కిడ్నాపర్ నుంచి బాలుడి తల్లికి ఇంటర్ నెట్ ఫోన్ కాల్ వచ్చింది. మహబూబాబాద్ పట్టణం లోని 140 సీసీ కెమెరాలు, 6 ఏ ఎన్ పీ ఆర్ కెమెరాలకు కూడా చిక్కకుండా జాగ్రత్త పడి కిడ్నాప్ చేసారు. 15 రోజుల ముందు నుంచే కిడ్నాప్ నకు స్కెచ్ గీసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తే బాలుడి ప్రాణానికి హాని తప్పదని హెచ్చరికలు చేసారు. 8 ప్రత్యేక బృందాలతో విచారణ వేగవంతం చేసారు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి. బాలుడి వివరాలు తెలిపిన వారి పేరు గోప్యంగా ఉంచి తగిన పారితోషకం అందిస్తామని మహబూబాబాద్ పోలీసులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: