ఈ మధ్య కాలంలో దొంగతనాలు కూడా చాలా తెలివిగా చేస్తున్నారు. దొంగలకు ఉన్న తెలివి  పోలీసులకు కూడా లేకుండా పోతుంది. పోలీసులు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే ఎక్కడో ఒక చోట ఏదోక ఘటన జరుగుతూనే ఉంది.  దీనితో ప్రజల్లో కూడా భయం అనేది ఎక్కువగా పెరుగుతుంది. తాజాగా చిత్తూరు జిల్లాలో ఒక  ఘటన చోటు చేసుకుంది. కుప్పం సమీపంలోని తమిళనాడు కృష్ణగిరి లో చోరీ కి సుమారు 15 కోట్ల రూపాయలు విలువచేసే మొబైల్ ఫోన్లు కంటైనర్  గురైంది.

కంటైనర్ లో చోరీ కి గురైన 15 కోట్ల రూపాయలు విలువ చేసే 1440 మొబైల్ ఫోన్లు  ఉన్నాయి అని పోలీసు అధికారులు పేర్కొన్నారు. చెన్నై నుంచి ముంబై కు వెళ్తుండగా కృష్ణగిరి సమీపం లోని  మెలుమలై  గ్రామం వద్ద ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు. చెన్నై - ముంబై  హైవే పైన మొబైల్ ఫోన్లు తీసుకెళ్తున్న కంటైనర ఆపి  వాహన డ్రైవర్తో సహా అందులోని మరో వ్యక్తిని చితకబాది కింద పడేసిన దుండగులు దొంగతనం చేసారు. స్థానికులు మొబైల్ కంటైనర్ ను ఆపడానికి ప్రయత్నం చేసినా సరే వారి ప్రయత్నాలు ఫలించలేదు.

విషయం గమనించి గాయాల పాలైన డ్రైవర్,క్లినర్ లను ఆసుపత్రిలో చేర్పించి, పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. క్రిష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో గాయాలపాలైన డ్రైవర్, క్లీనర్ చికిత్స తీసుకుంటున్నారు. దొంగతనానికి గురైన కంటైనర్ ను కృష్ణగిరి సమీపంలోని  అలగపావి గ్రామం వద్ద అందులోని పూర్తి మొబైల్స్ ను తీసుకొని ఖాళీ కంటైనర్ వదిలివెళ్ళారు దుండగులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కృష్ణగిరి పోలీసులు... కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక లోడ్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి కూడా పోలీసులు సిసి టీవీ ఫూటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: