దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ కి సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు. 18.10.2020 ఆదివారం సాయంత్రం 6గంటలకు బాలుడు కిడ్నాప్ అయ్యాడు అని పోలీసులు చెప్పారు. అదే రోజు రాత్రి 9.25 నిమిషాలకు మొదటి ఫోన్ కాల్ చేసి 45లక్షలు డిమాండ్ చేసాడని అన్నారు. దీక్షిత్ తల్లిని నమ్మించడం కోసం.. బాలుడికి కాస్త జ్వరంగా ఉందని, ట్యాబ్లేట్లు వేశానని నమ్మబలికాడు కిడ్నాపర్. సోమవారం మధ్యాహ్నం 1 గంటల వరకు ఏడు సార్ ఇంటర్ నెట్ ద్వారా స్కైప్ కాల్ చేసాడని పేర్కొన్నారు.

సోమవారం సాయంత్రం 6 గంటలకు డెడ్ లైన్ విధించాడు కిడ్నాపర్ అని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం 8 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి హెచ్చరించాడు అని అన్నారు. పోలీసులు, మీడియాకు తెలిస్తే బాబును చంపేస్తానని బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. బుధవారం ఉదయం 21.10.2020వ తేదీన ఉదయం 10.45 నిమిషాలకు కాల్ చేసాడు కిడ్నాపర్. 45 లక్షల నగదు లెక్క పెడుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాలని డిమాండ్ చేసాడు. కిడ్నాపర్ చెప్పినట్లుగానే డబ్బు రెడీ చేసి వీడియోలు మనోజ్ రెడ్డి అనే వ్యక్తి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసారు బాలుడి తల్లిదండ్రులు.

మధ్యాహ్నం 1 గంట వరకు డబ్బు రెడీ అయ్యిందా అని ఫోన్ కాల్ చేసాడు. 3 గంటలకు ఆ డబ్బు బ్యాగ్ తీసుకుని మహబూబాబాద్ లోని మూడు కోట్ల సెంటర్ కు రావాలని డిమాండ్ చేసాడు. 3 నుండి 8.30 గంటల వరకు నిరీక్షణ అనంతరం అనంతరం 8.30కు మరోసారి ఫాన్ కాల్ వచ్చింది. రాత్రి 8.30 తర్వాత తాళ్ళ పూసపల్లి రోడ్డు వైపు రావాలని ఆదేశాలు ఇచ్చాడు. కిడ్నాపర్ సూచించినట్లు శనిగపురం సమీపంలో చేతిలో 45 లక్షలతో తెల్లవారు జామున 3.30నిమిషాల వరకు వేచి చూసాడు బాలుడి తండ్రి. నేడు ఉదయం చంపేశారు అని గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: