11 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో అరెస్ట్ అయ్యారు. అసలు వివరాల్లోకి వెళితే అక్రమంగా దేశంలో నివసిస్తున్న అభియోగాలపై వీరిని అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి పోలీసు అధికారులు వెల్లడించారు. అమెరికాకు చెందిన ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ అధికారులు బుధవారం (అక్టోబర్ 21) దేశంలో అక్రమంగా నివసిస్తున్నారనే ఆభియోగాలపై మొత్తం 15 మంది విదేశీ విద్యార్థులను అరెస్టు చేశారు. వీరిలో 11 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపారు.

అమెరికాలోని ప్రధాన నగరాలు అయినటువంటి బోస్టన్‌‌, వాషింగ్టన్‌, హ్యూస్టన్‌, నెవార్క్‌, నాష్విల్లే, పిట్స్‌బర్గ్‌, హ్యారిస్‌బర్గ్ వంటి వివిధ‌ ప్రాంతాల నుంచి వీరు మొత్తం 15 మందిని  అక్కడి పోలీసు అధికారులు అరెస్టు చేశారు. వీరంతా ‘ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (OPT)’ అనే వెసులుబాటును ఉపయోగించుకొని అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నట్లు అక్కడి ‘ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌’ (ఐసీఈ) అధికారులు పేర్కొన్నారు. విదేశీ విద్యార్థులకు వారు చదివిన రంగంలో ఒక ఏడాది పాటు పనిచేసే అవకాశం ఓపీటీ కల్పిస్తుంది. స్టెమ్‌ ఓపీటీలో పాల్గొంటే మరో 24 నెలలు పనిచేస్తూ అక్కడే ఉండొచ్చు. కానీ, వీరంతా ఎక్కడా ఉద్యోగం చేయకుండానే ఓపీటీ అవకాశాన్ని వాడుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన మొత్తం 15 మంది విద్యార్థులపై అమెరికా చట్టాల ప్రకారం తగు చర్యలు వెంటనే తీసుకుంటామని ఆ పోలీసు అధికారులు తెలిపారు. స్టూడెంట్ వీసా వ్యవస్థలో పలు అవకతవకలు జరుగుతున్నాయని ఇటీవలే పలు సందర్భాల్లో వివిధ ఫిర్యాదులు, సూచనలు తమకు అందాయని, ఆ అవకతవకలపై అతి త్వరలోనే సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు వాటిిిపై తగిన విధంగా విచారణలు పూర్తి చేసి  అసలు నేరస్తులను అతి త్వరలోనే పట్టుకొని తప్పకుండా శిక్షిస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. కొన్ని ఏజెన్సీలు వీసాల పేరిట విద్యార్థులను పలు రకాలుగా మోసం చేస్తున్నాయని కావున విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: