జూన్ లో కరోనా వైరస్ లాక్డౌన్ ను ఉల్లంఘించినందుకు గానూ... తండ్రి కొడుకులను తమిళనాడులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ చేసిన తరువాత మరణించిన తమిళనాడు వ్యక్తి మరియు అతని కుమారుడు కేసు విషయంలో సిబిఐ కీలక విషయాలు వెల్లడించింది. కౌన్సిలింగ్ ఇవ్వాలి అని పిలిచి పోలీసులను ఆరు గంటలకు పైగా హింసించారని సిబిఐ పేర్కొంది. దేశ వ్యాప్తంగా సంచలనం అయిన... కస్టోడియల్ మరణాలపై సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది.

పోలీస్ స్టేషన్ గోడలపై రక్తం చిందించే విధంగా జయరాజ్, మరియు అతని కుమారుడు బెన్నిక్స్ ని చాలా దారుణంగా కొట్టారని, ఫోరెన్సిక్ ఆధారాలు వెల్లడయ్యాయని సిబిఐ పేర్కొంది. జూన్ 19 న తూత్తుకుడిలోని తమ మొబైల్ ఫోన్ దుకాణాన్ని కర్ఫ్యూకు మించి 15 నిమిషాలు తెరిచి ఉంచారనే ఆరోపణలతో జయరాజ్, బెన్నిక్‌లను అరెస్టు చేశారు. జయరాజ్‌ను పోలీసులు తీసుకెళ్లిన తరువాత, పోలీస్‌ స్టేషన్‌ కు చేరుకున్న అతని కుమారుడిని కూడా అరెస్టు చేశారు. సిబిఐ చార్జిషీట్లలో "రాత్రి 7.45 మరియు 3 గంటల మధ్య విరామాలతో ఇద్దరూ అనేక మార్లు దారుణ హింసకు గురయ్యారు".

తన చొక్కా ఉపయోగించి పోలీస్ స్టేషన్ ఫ్లోర్ పై  ఉన్న రక్తాన్ని శుభ్రం చేయమని బెన్నిక్స్ ను పోలీసులు ఆదేశించారు. ఈ నేరాన్ని కప్పిపుచ్చడానికి పోలీసులు బెన్నిక్స్, జయరాజ్‌ లపై తప్పుడు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు సిబిఐ తెలిపింది. లాక్డౌన్ మార్గదర్శకాలను ఇద్దరూ ఉల్లంఘించలేదని దర్యాప్తులో తేలింది. ఇద్దరి రక్తపు  మరకలబట్టలు మరుసటి రోజు రెండుసార్లు మార్చారని ఆ తర్వాత వారిని కోర్ట్ కి తీసుకు వెళ్ళారు అని సిబిఐ పేర్కొంది. బట్టలు వారి కుటుంబానికి అప్పగించలేదు అని తెలిపింది.

కాని ప్రభుత్వ ఆసుపత్రిలో చెత్తలో వేసారని సిబిఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది. వివిధ సాక్షులను ఉటంకిస్తూ, కర్రలను ఉపయోగించి పోలీసులు తండ్రి మరియు కొడుకును హింసించడాన్ని సిబిఐ వివరించింది. ఫోరెన్సిక్ బృందాలు గుర్తించిన సంతంకుళం పోలీస్ స్టేషన్ గోడలపై వారి రక్తం సిబిఐ అధికారులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: