సాధారణంగా క్రైం విషయంలో చాలా వరకు కూడా భయం ఉంటుంది. ఒక్కసారి క్రైం చేస్తే జీవితం అన్ని విధాలుగా కూడా నాశనం అయినట్టే అనే విష్యం చెప్పాల్సిన అవసరం లేదు. కాని ఒక బాలుడు మాత్రం హత్యలు చేయడమే అలవాటుగా మారింది. అసలు ఏంటి మేటర్ అంటే... గుజరాత్, రాజస్థాన్ సరిహద్దుల్లో నివాసం ఉండే ఒక 16 ఏళ్ళ యువకుడు మూడు మర్డర్లు చేసినా సరే పోలీసులకు దొరకలేదు అంటే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆశ్చర్యపోయారు. తండ్రిని చంపాడు, చెల్లిని చంపాడు, స్కూల్ లో డబ్బులు అడిగాడు అని క్లాస్ మేట్ ని చంపాడు.

ఎలా చంపాడు ఏంటీ అనేది పక్కన పెడితే... ధ్రువ సినిమాలో అరవింద్ స్వామి చెప్పినట్టు నేను తప్పు చేయడం కంటే చేసిన తప్పు సాక్ష్యాలు మాయం చేయడం మీదనే ఎక్కువ ఫోకస్ పెడతాను అన్నట్టు...  బాబు కూడా అంతే... ఒక్కో మర్డర్ కి ఒక్కో క్రైం వీడియో చూసాడు. చూసిన క్రైం వీడియోలో ఎలా అయితే చేసారో మర్డర్ చేసే ముందు మర్డర్ చేసిన తర్వాత సాక్ష్యాలను మాయం చేయడానికి కష్టపడి... విజయవంతంగా సాక్ష్యాలు మాయం చేసాడు. ముందు తండ్రిని చంపగా దొరకలేదు. ఆ తర్వాత చెల్లిని చంపాడు. దొరకలేదు. తర్వాత క్లోజ్ ఫ్రెండ్ ని చంపాడు దొరకలేదు.

వీరు ముగ్గురు కూడా అతనికి సన్నిహితంగా ఉన్న వారే కావడంతో పోలీసులు బాబుని చాలా సార్లు ప్రశ్నించారు. అయితే డౌట్ వచ్చి అతను వాడే ఫోన్ చెక్ చేసారు. బాబు మొత్తం చూసేది క్రైం వీడియోలే అనే విషయం పోలీసులకు అర్ధమైంది. తమ స్టైల్ లో విచారించారు. నేనే అన్నాడు... మూడు నేనే అనేసరికి పోలీసులు కూడా షాక్ అయ్యారు. అతని నోటి మాట రికార్డ్ చేయడం మినహా పోలీసులకు ఏ ఒక్క మర్డర్ లో కూడా అతని వేలి ముద్రలు దొరకలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: