హైదరాబాద్ లో నేరాల విషయంలో కాస్త ఆందోళన వ్యక్తమవుతుంది. పోలీసులు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే హైదరాబాద్ లో నేరాలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. దీనిపై ఇప్పుడు ఆందోళన ఉంది. ఇక పోలీసులు ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం తో హైదరాబాద్ లో నేరాలను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. బషీర్ బాగ్ సిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నకిలీ ఆర్మీ అధికారిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసారని చెప్పారు ఆయన.

విలాసవంతమైన కార్లలో తిరుగుతూ మోసాలు చేస్తున్నారని అన్నారు. పెళ్ళిళ్ళ పేరుతో మహిళలను ట్రాప్ చేసిన నకిలీ ఆర్మీ ఆఫీసర్ శ్రీను నాయక్ అరెస్ట్ చేశామని ఆయన వివరించారు. మూడు డమ్మీ పిస్టల్స్, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నకిలీ ఆర్మీ మేజర్ ని అరెస్ట్ చేశాము అని పేర్కొన్నారు. ఆర్మీ అధికారి అంటూ 6 కోట్లు మోసం  చేశాడన్నారు ఆయన. ప్రకాశం జిల్లాకు చెందిన ముదావత్ శ్రీను నాయక్ నేరెడ్మెట్ లో స్థిరపడ్డాడని, నకిలీ ఆర్మీ యూనిఫామ్ రెడీ చేసుకొని 2014 నుండి మ్యాట్రిమోనిలో పెళ్లి కోసం సిద్ధమైనాడు అని ఆయన వ్యాఖ్యానించారు.

17 మందిని పెళ్లి పేరుతో ఆరు కోట్ల 61 లక్షలు మోసం చేశాడని ఆయన వివరించారు. నకిలీ యూనిఫామ్, నకిలీ గన్స్, ఐడి కార్డ్స్, మాస్టర్ డిగ్రీ కార్డ్స్, సర్టిఫికెట్ స్వాదీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. 85 వేల క్యాష్ స్వాదీనం చేసుకున్నామని ఆయన అన్నారు. మోసం చేసిన డబ్బుతో లగ్జరీ లైఫ్ గడిపాడు అన్నారు. బల్దియా ఎన్నికల్లో సిటీలో ఇప్పటి వరకు కోటి 35 లక్షలు హవాలా డబ్బు స్వాదీనం చేసుకున్నామని చెప్పారు. 2,098 లైసెన్స్ గన్స్ అప్పగించారు అని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: