ఉదయం పూట కృష్ణాజిల్లాలో దుండగులు రెచ్చిపోయారు..  అవనిగడ్డ లోని ఒక ఇంట్లో చొరబడి ఒక వ్యక్తిని  దారుణంగా చంపేశారు.. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా  కలకలం సృష్టించింది ..  కృష్ణాజిల్లా అవనిగడ్డలో ప్రముఖ డాక్టర్ కోట శ్రీహరి రావు దారుణ హత్యకు గురయ్యారు.. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు తన ఇంట్లోకి ప్రవేశించి అత్యంత దారుణంగా కిరాతకంగా చంపేశారు..అసలు ఆ దుండగులు డాక్టర్ని చంపవలసిన అవసరం ఏంటి? అసలేం జరిగింది  ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం ..

శ్రీహరి రావు  కృష్ణాజిల్లా అవనిగడ్డలో నివాసముంటున్నారు.. అతడు డాక్టర్ తన ఇంట్లోనే కింది అంతస్తులో ఆసుపత్రి ఏర్పాటు చేశారు.. పై అంతస్తులో శ్రీహరి రావు నివాసం ఉంటారు... శ్రీహరి రావు కు భార్య ఒక కొడుకు మరియు  కూతురు ఉన్నారు.. వాళ్ల పిల్లలు కూడా వైద్య రంగంలో సేవలను అందిస్తున్నారు.. వాళ్ల పిల్లలు వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు ..

అయితే డాక్టర్ శ్రీహరి రావు ఎప్పటిలాగే ఉదయం 9 గంటలకు కింది అంతస్తుకు వచ్చి రోగులకి వైద్య సేవలను అందించేవారు.. కానీ ఈ రోజు అలా జరగలేదు. తొమ్మిది దాటిన డాక్టర్ కిందికి రావడం లేదు. నర్స్  ఫోన్ చేసిన డాక్టర్  లిఫ్ట్ చేయడం లేదు  ఏదో జరుగుతుంది హాస్పిటల్ సిబ్బందిలో అలజడి మొదలైయింది .. తొమ్మిదిన్నర గంటలకు కూడా ఆయన కిందకి రాకపోవడంతో అక్కడ ఉన్న నర్సు పైకి వెళ్లి చూడగా  శ్రీహరి రావు తన రూమ్ లో రక్తపు మడుగులో కనిపించరు ఆ దృశ్యాన్ని  చూసి నర్స్  షాక్  కి గురైంది.. శ్రీహరి రావు ను ఆలా  భయపడిపోయిన నర్స్  వెంటనే కిందికి వచ్చి విషయాన్నంతా అక్కడి సిబ్బంది తో చెప్పింది..

దీంతో ఆస్పత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు.. రంగంలోకి దిగిన  పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.. ఇంట్లో ఎవరు లేరని తెలుసుకున్న దుండగులు దొంగతనం చేయాలని ప్లాన్ వేశారు..
 అలా లోపలికి వచ్చిన ఆ వ్యక్తులు రెండు బీరువా లో నుంచి బంగారం మరియు కొంత డబ్బును తీసుకొని పారిపోయే ప్రయత్నం చేయగా శ్రీహరి రావు వారిని చూసి అడ్డుకున్నట్లు తెలుస్తుంది..ఆలా మధ్య జరిగిన ఘర్షణలో శ్రీహరి రావు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.. అయితే ఇంత దారుణంగా హత్య చేసింది  కేవలం బంగారం మరియు డబ్బు కోసమా వేరే  ఏదైనా కారణం ఉందా అనే  కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

ఇంత దారుణమైన ఘటన జరిగినా ఎలాంటి ఆధారాలు లేకుండా దుండగులు జాగ్రత్త పడ్డారు.. శ్రీహరి రావుని హత్య చేసిన  వీడియో దొరకకుండా అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాలను ధ్వంసం చేశారని స్పష్టంగా తెలుస్తుంది .. దీంతో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో  పోలీసులు ప్రత్యేక టీం లను  ఏర్పాటు చేసి కేసును మరింత వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.. ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు అనేది ఇంకా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: