నేటి యువత జాబ్ లేనిదే బ్రతకలేమనే స్థితికి చేరుకుంది. అది ఎంతలా అంటే జాబ్ రాకుంటే ఇక నేను ఉండి వేస్ట్ అనుకునే స్థాయికి చేరుకున్నారు. గవర్నమెంట్ జాబ్ ఉంటేనే లైఫ్ లేదంటే ఇక నాకు జీవనాధారమే లేదనేంతగా మారిపోయారు. అందులోనూ పోలీస్ వ్యవస్థపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎంతో మంది జాబ్ రావట్లేదనే మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆర్మీ ఉద్యోగానికి నేను పనికి రానని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  జిట్ట శంకర్, అనిత అనే దంపతులు కుభీర్ గ్రామంలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. వీరి పెద్ద కొడుకు ప్రవీణ్ డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసి ఆర్మీకి ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. కాగా ఈ మధ్యనే ఆర్మీ ఉద్యోగం కోసం అతని స్నేహితులు దరఖాస్తు చేసుకున్నారు. దాంతో ప్రవీణ్  దరఖాస్తు చేసుకోవడానికి.. అందుకు కావాల్సిన అర్హతల కోసం కరీంనగర్ లో ఆర్మీ ఎంపిక కోసం శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్ కు ఫోన్ చేసి వివరాలను కనుకున్నాడు.

 కాగా ఆ శిక్షణ సెంటర్ వాళ్లు చెప్పిన శారీరక కొలతలు ప్రవీణ్ కు సరిపోలేదు. దాంతో ప్రవీణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఉదయం వాకింగ్ కు అని వెళ్లి తమ వ్యవసాయ పొలంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఉదయం వాకింగ్ కు అని వెళ్లిన కొడుకు ఇంకా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ తమ్ముడు అతన్ని వెతుక్కుటూ పొలం దగ్గరకు వచ్చాడు. అక్కడే ప్రవీణ్ చెట్టుకు ఉరి తాడుతో వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: