నేటి సమాజంలో ఒక్క వస్తువులకే రేట్లు ఫిక్స్ చేయడం లేదు. వస్తువులతో పాటుగా మనుషులకు కూడా ఒక రేటంటూ పలుకుతోంది. అదేంటి అని అనుకుంటున్నారా.. అవునండి.. ఇది నిజంగా నిజం.. అది కూడా పుట్టిన చిన్నారులకే.. పాపకైతే ఒక రేటు.. బాబుకు అయితే మరో రేటు పెట్టి మరీ అమ్మేస్తున్నారు. అమ్మడం అనడం కంటే కొంటున్నారు అనడమే బాగుంటుందేమో.. ఎందుకంటారా.. అవును నిరుపేద కుటుంబాలు, పూటకు గతిలేని వారినే ఆసరాగా తీసుకుని కొందరు దుండగులు పసిపిల్లలను కొనే బిజినెస్ ను మొదలు పెట్టారు. వేలు, లక్షల్లో పలుకుతున్న పసిపిల్లల అమ్మకాలు దారుణంగా కొనసాగుతున్నాయి. అచ్చం ఏదో ఖరీదైన వస్తువుకు పలికినట్టే చిన్నారులకు కూడా రేట్లు పెట్టేస్తున్నారు.. అవును మూడుపూటలా తిండి దొరక్కో, రోజుకు వంద కూడా సంపాదించలేని మా లాంటి వారికి ఇంత డబ్బు వస్తుందనో లేక మా పిల్లలన్నా మంచిగా బతుకుతారనే కోరికతోనో గాని వారి పిల్లలను మాత్రం అమ్మేస్తున్నారు కొందరి తల్లిదండ్రులు.
ఆడపిల్లలకైతే  రూ.60 వేలు, మగపిల్లడికైతే రూ.1.50 లక్షలుగా బేరాలు ఆడుతున్నారు. ఈ ఘోరం ముంబాయి నడిబొడ్డున జరుగుతోంది. అక్కడ పేద ప్రజలను, ఫుట్ పాత్ లపై నివసించే వారినే టార్గెట్ చేసింది ఓ ముఠా. గుట్టుచప్పుడు కాకుండా పిల్లల తల్లిదండ్రులతో బేరాలు ఆడుతూ నెలల పిల్లలను కొంటున్నారు. అనుకోకుండా ఈ ముఠాలోని మహిళ పోలీసులకు పట్టుబడటంతో వీరి ఆగడాలన్నీ బయటకొచ్చాయి. రూపాలి వెర్మ అనే మహిళ సాయంతో రూక్షర్ తన ఆడబిడ్డను అమ్మేసింది. ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. అమ్మిన పాపను శిశు సంరక్షణ కేంద్రానికి తరలించి రూపాలి వెర్మను విచారించారు.

 ఈ విచారణలో ఆమె చెప్పిన మాటలు విని పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ ముఠాను 8 మంది నడుపుతున్నట్టు ఆ మహిళ తెలిపింది. విచిత్రం ఏమిటంటే ఆ ముఠాలో ఆరుగురు మహిళలే ఉన్నారు. వీరంతా పేదరికంలో మగ్గి గర్భవతులైన వారినే టార్గెట్ చేసి బేరమాడతారని వెళ్లిడించింది ఆ మహిళ. ఆరునెలల నుంచి ఇలా చేస్తూ నలుగురు పిల్లలను కొని వారిని ధనవంతులకు, పిల్లలు లేని వారికి అమ్మేసినట్టు ఆమె తెలిపింది. ఈ గ్రూపులో ఉన్న మిగతా సభ్యుల వివరాలను కూడా ఆమె తెలిపింది. ఈ ముఠా లోని వ్యక్తులపై అక్రమ రవాణా కింద కేసు నమోదు చేసుకుని కటకటాలకు తరలించారు పోలీసులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: