నేటి సమాజంలో సైబర్ నేరాలు జోరుగా కొనసాగుతున్నాయి. తెలియని వ్యక్తులను నమ్మామో మనం ఇక నట్టేట మునిగినట్టే. ఇన్నాళ్లైతే మీ ఫోన్ నెంబర్ కు లాటరీ తగిలిందండీ.. ఓటీటీ చెప్పించుకుని మరీ డబ్బులను దండుకునే వారు నేరగాళ్లు. దీనిపై పోలీసులు అవగాహన కల్పించడంతో మరో కొత్త దారిని ఎంచుకున్నారు సైబర్ నేరగాళ్లు. మన ఫ్రెండ్స్ ఫోటోలు, పేర్లతో సామాజిక మాధ్యమాల్లో ఫేక్ ఖాతాలు క్రియేట్ చేసేసి కొందరిని వారి మాయ మాటలతో నమ్మించి అడ్డంగా మోసం చేస్తూ డబ్బులను పొందుతున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్ లల్లో నకిలీ ఖాతాలు క్రియేట్ చేసి.. నాకు బాగాలేదనో లేక మా ఇంట్లో వాళ్లకు బాగాలేదనో ఎదో ఒక కారణం చెప్పి వీలైనంత తొందరలో మీ డబ్బులను తిరిగి ఇచ్చేస్తానంటూ నమ్మబలుకు తున్నారు.
వీరి మాయ మాటలు నమ్మిన కొందరు వారి నిజమే చెబుతున్నారని ఎవరు అని చూసుకోకుండా డబ్బులను వారి అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. తీరా వారు నిజమైన స్నేహితులు కారని నిజం తెలిసి లబోదిబో మంటూ మొత్తుకోవడం తప్పా ఏం చెయ్యలేకపోతున్నారు. అయితే తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రకు చెందిన ఓ ఇంజనీర్ కు జరిగింది. ఫేక్ అకౌంట్ తో వాట్సాప్ కాల్ చేసిన సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఏకంగా రూ.3 లక్షలు కోల్పోయాడు ఆ వ్యక్తి.  పూర్తి వివరాల్లోకి వెళితే.. వాకాడ్ లో చందన్ సి రౌతేలా(41) ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి తన స్నేహితుడి ప్రొఫైల్ ఫోటోతో వాట్సాప్ కాల్ వచ్చింది. దాంతో అతను నా స్నేహితుడే అని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు.

ఆ వ్యక్తి నాకు అర్జంటుగా మూడు లక్షలు అవసరముందని.. తొందరలోనే తిరిగి ఇచ్చేస్తానని చందన్ సి రౌతేలాను అడిగాడు. స్నేహితుడే కదా అని ..  అందులోనూ ఆపదలో ఉన్నానని చెప్పాడని అతడిని నమ్మి ఈ ఇంజనీర్ అతడు అడిగినంత డబ్బును అతను ఇచ్చిన బ్యాంకు అకౌంట్లో వేశాడు. అయితే డబ్బులు అందాయో లేదో తెలుసుకుందామని  ఇంజనీర్ అతని స్నేహితుడికి కాల్ చేశాడు. అయితే ఫోన్ లిఫ్ట్ చేసిన స్నేహితుడు నేను డబ్బు అసలు అడగలేదని ఎవరో నిన్ను మోసం చేశారని ఉమేష్ శర్మ చెప్పాడు. దాంతో రౌతేరా మోసపోయానని లబోదిబో మని ఏడ్చి వాకడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దారుణం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలను మొదలు పెట్టారు. ఇలాంటి కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా  ఉండమని పోలీసులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: