మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘గని’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై మెగా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పింది ‘గని’ టీం. ఇటీవలె గని ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన ఈ చిత్ర యూనిట్.. ఒకడుగు ముందుకు వేసి  విడుదల తేదీలో కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమాను జులై 30 న రిలీజ్ చెయ్యబోతున్నట్లుగా ఈ చిత్ర యూనిట్ ఆఫీషియల్ గా ప్రకటించింది. కాగా మొన్నటి వరకు ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. కానీ ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతుండటంతో జులై లోనే రిలీజ్ చెయ్యబోతున్నట్టు ఈ యూనిట్ ప్రకటించేసింది.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొర్రపాటి కిరణ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ ‘గని’ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నా. కాగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మెగా వరుణ్ తేజ్ చాలా కసరత్తులు చేస్తున్నారట. అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ల ఆధ్వర్యంలో వరుణ్ శిక్షణ కూడా తీసుకుంటున్నాడని సమాచారం. కాగా ఇప్పటికే రిలీజైన వరుణ్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే వరుణ్ తేజ్ ప్రస్తుతం గని సినిమాతో పాటుగా .. వెంకటేష్ తో కలిసి ఎఫ్ 3 సినిమాలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఈ రెండు సినిమాలు కూడా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒక సినిమా ద్వారా ప్రేక్షకును నవ్వించి.. మరో సినిమా ద్వారా బాక్సింగ్ ఫీల్డ్ గురించి చెప్పడానికి సిద్దమయ్యాడు వరుణ్ తేజ్. బాక్సింగ్ చేస్తూ ఎనర్జిటిక్ లుక్ లో వరుణ్ అదిరిపోయాడంటూ మెగా ఫ్యాన్స్ నుంచి మంచి టాక్ తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. కాగా బ్యాగ్రౌండ్ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తన నటనతోనే ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఈ హీరో. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో కథల ఎంపికలో తడబడ్డా.. ఇప్పుడు మాత్రం ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకుంటూ దూసుకువెళుతున్నారు వరుణ్ తేజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: