నేటి సమాజంలో ఆన్ లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఎంతో మంది దారుణంగా మోసపోతున్నారు.  ఆన్ లైన్ లో చెప్పే పిచ్చి మాటలను నమ్మకండని.. వాళ్లు చెప్పే వెర్రి కథలను నమ్మొద్దని సైబర్ పోలీసులు జనాలను ఎంతగానో హెచ్చరిస్తున్నారు. అందులోనూ.. ఆన్ లైన్ ప్రేమలకు దూరంగా ఉండండీ.. బురడీ మాటలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండని సైబర్ పోలీసులు నెత్తీ, నోరు కొట్టుకుంటూనే ఉన్నారు. అయినా కొందరు ఇంకా ఈ ఆన్ లైన్ మోసగాళ్ల మాటలను నమ్మి వారి చేతిలో మోసపోతూనే ఉన్నారు. ఇక తాజాగా కూడా ఇలాంటి వ్యవహారమే జరిగింది. ఆన్ లైన్ ద్వారా ఓ చిలక చెప్పిన మాటలను నమ్మి ఏకంగా రూ.14 లక్షలు లాస్ అయ్యాడు ఓ యువకుడు. పెళ్లి చేసుకుందామని ఎంతో తియ్యగా మాట్లాడి ఓ మాయలేడీ పెళ్లి ముహూర్తం కూడా పెట్టించింది. పాపం పెళ్లి రెండు రోజులే ఉందనంగా ఆ లేడీ ఫోన్ స్విచాఫ్ చేసేసింది. ఇంకేడుంటది డబ్బులతో ఎప్పుడో జంప్.. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని పద్మారావు నగర్ లో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. ఈ యువకుడు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా పాల్గొంటూ ఉంటాడు.

కాగా చిన్న చిన్న వీడియోలను తీస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. కాగా ఈ క్రమంలోనే అర్జున్ కు గతేడాదిలో వర్ణణ మల్లిఖార్జున్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ఫోన్ నెంబర్లు మార్చుకునే వరకు వచ్చింది. ఇక అప్పటినుంచి ప్రతిరోజు వాట్సాప్ చాటింగ్ లు చేసుకునేవారు. కాగా ఆ చాటింగ్ కాస్త ప్రేమగా అవతారమెత్తింది. నాకు అమ్మానాన్న లేరు.. నా తమ్ముడిని, నన్ను మా అక్కే చదివించిందని ఆ యువతి అర్జున్ ను నమ్మించింది. ఇంకేముంది ప్రేమ దాకా వచ్చిన బంధాన్ని పెళ్లితో ముడిపెడదామని ఆ యువకుడిని కోరింది. దానికి ఆ యువకుడు కూడా సంబురపడి పోయి ఓకే కూడా చెప్పేసాడు. ఇంకేముంది అప్పటి నుంచి ఆ యువతి అర్జున్ పర్సును ఖాళీ చేసే పని పెట్టుకుంది. లాప్ టాప్, బంగారు ఆభరణాలు, కరోనా హాస్పటల్ బిల్లు అంటూ వివిధ కారణాలు చెప్పి మొత్తంగా రూ.6 లక్షల వరకు వసూలు చేసింది.

 ఇక ఇదిలా ఉంటే నవంబర్ లో మన పెళ్లి రోజు ఫిక్స్ చేసానని వర్ణన అర్జున్ చెవిలో పెద్ద క్యాలీఫ్లవర్ పెట్టింది. పెళ్లి ఖర్చులకు డబ్బులు కావాలంటూ అర్జున్ ను అడిగింది. చేసుకునే పిల్లనే కదా అని అర్జున్ కూడా అడిగినన్నీ ఇచ్చాడు. కేవలం 25 రోజుల వ్యవధిలోనే రూ.8 లక్షల డబ్బు, బంగారు ఆభరణాలు పంపించాడు. పాపం.. పాప అసలు రంగును అర్జున్ పెళ్లికి రెండు రోజులు ఉందనంగా తెలుసుకున్నాడు. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసేసింది. ఇంకేముంది కిలాడీ పాప చేసిన మోసానికి అర్జున్ బాబుగారు షాక్ అయ్యారు. అయ్యో.. నిలువునా మోసం చేసిందే.. అంటూ లబోదిబో మొత్తుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మాయలేడీని కనిపెట్టే పనిలో పడ్డారు. అందుకోసమే ఫోన్ ప్రేమలకు దూరంగా ఉండమని చెప్పేది.. ఎంత చెప్పినా కొందరు మూర్కులు మారక.. ఇలాంటి వాటికి మోసపోతూనే ఉంటారు పాపం.

మరింత సమాచారం తెలుసుకోండి: