ఓ యువకుడు చేసిన తప్పు.. అతని పాలిట శాపమైంది. తానంత తానుగా ప్రాణాలు తీసుకునే పరిస్థితికి చేరుకున్నాడు. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆ యువకుడిని, అతని కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు కుల పెద్దలు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడి నిన్న రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండంలో చోటుచేసుకుంది. ముస్లాపూర్ కు చెందిన ఇప్ప శంకర్ అనే యువకుడినే వారి కుల పెద్దలు బహిష్కరించారు. ఈ యువకుడు ఆరేండ్లుగా ఓ హత్య కేసులో నిందితుడుగా ఉన్నాడు.
హత్య కేసులో భాగంగా శంకర్ శిక్షను కూడా అనుభవించించాడు. కాగా పోలీసులు హత్య కేసుకు సంబంధించిన కేసు కొట్టివేయడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. హత్య చేసిన వ్యక్తి మా కులంలో ఉండరాదంటూ శంకర్ నిందితుడిగా ఉన్నప్పుడే అతని కుటుంబాన్ని తమ కులంలో నుంచి బహిష్కరించారు. అయితే శంకర్ తమ కులంలో ఉండటానికి కోర్టు అనుమతిచ్చింది. కానీ గ్రామస్తులు మాత్రం శంకర్ కుటుంబానికి ఆంక్షలు విధించారు. ఇదిలా ఉంటే కుల పెద్దలు మాత్రం.. మూడు లక్షల నష్టపరిహారం చెల్లిస్తేనే కులంలోకి రావాలంటూ ఒక కండీషన్ కూడా పెట్టారు.

కుల పెద్దలు ఇచ్చిన తీర్పుతో శంకర్ ఇదెక్కడి న్యాయమని అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ లో తమ కుల పెద్దలపై జనవరి 6న కేసు పెట్టాడు. అయినా పోలీసులు ఈ కేసు గురించి పట్టించుకోలేదు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన శంకర్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కాగా ఆత్మ హత్య చేసుకునే ముందు శంకర్ తీసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ  వైరల్ గా మారింది. ఈ ఘనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువకుడు చేసిన హత్యే అతని చావుకు కారణమైందని భావిస్తున్నారు కొందరు. అలాగే  కనికరం లేని కుల పెద్దలు కూడా అలా కుల బహిష్కరణ చేయడం కూడా ఆ యువకుడి చావుకు కారణమైందని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: