ఈ రోజుల్లో బంధాలు, బంధుత్వాలు పూర్తిగా మటుమాయం అవుతున్నాయి. మాకంటూ ఆస్తి ఉంటే చాలు ఇంకెవరు అవసరం లేదంటూ అన్ని బంధాలను త్రెంచేసుకుంటున్నారు. ఇంకొందరైతే ఆస్తి పాస్తులను చూసే రిలేషన్ను కొనసాగిస్తుంటారు. ఆస్తి పాస్తులకిచ్చే విలువను మనుషులకు ఇవ్వలేకపోతున్నారు. అందుకే ఆస్తుల కోసం ఎంతటి దారుణాలు చెయ్యడానికైనా వెనకాడటం లేదు. సొంత కుటుంబ సభ్యుల ఆస్తిపై కన్నేసిన ఓ మహిళ నయా మోసానికి ప్లాన్ వేసింది. తనతో పాటుగా ఏడుగురు తోబుట్టువులున్నా.. నేను ఒక్కదాన్నే కూతురునంటూ ఓ మహిళ పక్కా ప్లాన్ తో అధికారులనే బురడీ కొట్టించింది. తన ఫ్యామిలీ సర్టిఫికేట్ ను అక్రమంగా సంపాదించి.. తన తల్లి పేరుమీదున్న ఆస్తులన్నీ అమ్మి సొమ్మను వెనకేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఎల్ల నర్సమ్మకు ఎనిమిది మంది పిల్లలున్నారు. వారిలో ఐదుగురు కుమార్తులు కాగా.. ముగ్గురు కొడుకులు ఉన్నారు.  
ఇందులో ఒకరైన రమాదేవి తన తల్లి ఆస్తులనే కాజేయాలని దుర్బుద్ధి ఏర్పడింది. కోట్లు విలువ చేసే ఆస్తిని ఎలాగైనా దక్కించుకోవాలని పథకం పన్నింది. అనుకున్న ప్రకారమే..  ఎల్ల నర్సమ్మకు నేను ఒక్కదాన్నే బిడ్డనంటూ అధికారులను బురిడీ కొట్టించి .. రెవెన్యూ అధికారుల నుంచి ఫ్యామిలీ సర్టిఫికెట్ ను రాబట్టింది. ఆ సర్టిఫికెట్ తో రమాదేవీ తన తల్లిపేరుమీదున్న ఆస్తులను విక్రయించడం స్టార్ట్ చేసింది. కాగా కొన్నాళ్లకు రామాదేవీ చేస్తున్న బాగోతం బయటపడింది. రమాదేవితో పాటుగా నర్సమ్మకు మరో నలుగురు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు ఉన్నన్న విషయం తహసీల్దార్ కు తెలిసి పోయింది.

తోబుట్టులున్న అసలు విషయం దాచిపెట్టి వారసత్వంగా అందరికీ దక్కాల్సిన  భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న రమాదేవిని పిలిచి విచారించారు తహసీల్దార్. ఆ విచారణలో రామా దేవి తనతప్పును ఒప్పుకుంది. అలాగే తాను క్రియేట్ చేసిన ఫ్యామిలీ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని అధికారులకు లిఖిత పూర్వంగా లేఖను కూడా సమర్పించింది. లేఖ ఇచ్చిన రమాదేవి తీరులో మార్పు రాలేకపోగా.. ఆమె క్రియేట్ చేసిన సర్టిఫికెట్ తోనే ఆవుకు మండాలనికి చెందిన కొంత మందికి డిసెంబర్ 30 స్థలాలను విక్రయించి రిజిస్ట్రేషన్ కూడా చేయించింది. దాంతో ఆమె మోసాన్ని తెలుసుకున్న తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పుడు సర్టిఫికెట్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న రమాదేవిపై పోలీసులు పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: