రూపానికి, చూడ‌టానికి మ‌హిళ అయితే చాలు.. వారికి లైంగిక వేధింపులు త‌ప్ప‌డంలేదు. వారు ఏ స్థాయిలో ఉన్నాస‌రే.. తాజాగా తమిళనాడులో ఓ మహిళా ఐపీఎస్ అధికారి లైంగిక వేధింపుల‌ను ఎదుర్కొంటోన్న సంఘ‌ట‌న సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది.కు గురైన ఘటన తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. తన సహచర ఉద్యోగి, ఉన్నత హోదాలో ఉన్న పోలీస్ అధికారి తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆమె ఆరోపించారు.

ముఖ్యమంత్రి  పళనిస్వామి ఇటీవ‌ల సెంట్రల్ జిల్లాలను ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమె వేధింపులకు గురైనట్లు తెలుస్తోంది.  లా&ఆర్డర్ స్పెషల్ డీజీపీ రాజేష్ దాస్ వేధింపుల‌కు గురిచేస్తున్నారంటూ ఆ మహిళా ఐపీఎస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో అతనిపై వేటు పడింది.  త్వరలో జరగనున్న ప్రధాని పర్యటనకు సంబంధించి సెక్యూరిటీ రివ్యూ మీటింగ్స్‌ నుంచి కూడా దాస్‌ను తప్పించింది. దాస్ మాత్రం ఇంతవరకూ ఈ ఆరోపణలపై స్పందించలేదు.

త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌ణాళికాభివృద్ధి విభాగం అద‌న‌పు చీఫ్ సెక్రటరీ జయశ్రీ రఘునందన్ ఆధ్వ‌ర్యంలో ఓ కమిటీని అక్క‌డి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారులు సీమా అగర్వాల్,అరుణ్, చాముండేశ్వరి, వీకె రమేష్ బాబు, లొరెట్టా జానాలను కమిటీలో సభ్యులుగా నియమించింది. పని ప్రదేశంలో లైంగిక వేధింపులపై ఈ కమిటీ విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని రాష్ట్ర హోంశాఖ విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు.

ప్రభుత్వం నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తోందని డీఎంకె అధినేత స్టాలిన్ ఆరోపించారు. ఇది అత్యంత అసహ్యకరమని... సిగ్గుచేటని విమర్శించారు. ధైర్యంగా ముందుకొచ్చి సదరు డీజీపీపై ఫిర్యాదు చేసిన ఆ మహిళా ఐపీఎస్‌కు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులో పోలీస్ బాసులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఇదే తొలిసారి కాదు. గ‌తంలో కూడా జ‌రిగాయి. 2018 ఆగ‌స్టులో జ‌రిగిన ఒక సంఘ‌ట‌న‌కు సంబందించి నిందితుడిని ప్ర‌భుత్వం కాపాడుతోందంటూ బాధితురాలు కోర్టును ఆశ్ర‌యించ‌డంతో చెన్నై హైకోర్టు ఆ కేసును అసాదార‌ణ రీతిలో తెలంగాణ పోలీసుల‌కు అప్ప‌జెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: