వావివరస‌ల్లేవు. స్నేహితుడి తల్లిపై కన్నేశాడు. సమయం చూసి కోరిక తీర్చాలని అడిగాడు. అంగీక‌రించ‌క‌పోవ‌డంతో బండ‌రాయితో దాడిచేశాడు. ఆ త‌ల్లి భ‌య‌ప‌డి అర‌వ‌డంతో దుర్మార్గుడు పారిపోయిన‌ప్ప‌టికీ ఆమె మృతిచెందింది. ఈ విషాద‌క‌ర‌మైన సంఘ‌ట‌న చత్తీస్గఢ్‌లో జరిగింది. స్నేహితుడి త‌ల్లి అంటే త‌ల్లితో స‌మాన‌మ‌ని, వ‌రుస‌లేమీ చూడ‌కుండా ఉన్మాదంతో వ్య‌వ‌హ‌రించిన నిందితుడు చింటుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఛత్తీస్ గఢ్‌. మహాసముండ్ జిల్లా బాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలో గల గ్రామంలో చింతామణి పటేల్ అలియాస్ చింటూ స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. పొలంలో వరి కోసే యంత్రం చూసివచ్చేందుకు తోడు కోసం వ‌చ్చాన‌ని చెప్ప‌డంతో కుమారుడు లేక‌పోయినా తాను తోడు వ‌స్తాన‌ని చెప్పి చింటూతో ఆమె బ‌య‌లుదేరి వెళ్లింది. అదే ఆమె చేసిన త‌ప్పైంది. తోడు వెళ్లిన ఆ మ‌హిళ‌పై చింటూ క‌న్ను ప‌డింది. పొలం నుంచి తిరిగి వ‌చ్చే స‌మ‌యంలో కోరిక తీర్చాల‌ని అడ‌గ‌డం ప్రారంభించాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ మ‌హిళ షాక్‌కు గురైంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా కోరిక తీర్చాలంటూ పిచ్చివాడిలా ప్ర‌వ‌ర్తించ‌డంతో ఎటూ పాలుపోని ప‌రిస్థితి.

పిచ్చివాడిలా ప్ర‌వ‌ర్తిస్తున్న చింటూ ఉన్మాదంతో త‌న కోరిక తీర్చ‌లేదంటూ బండరాయితో ఆమె త‌ల‌పై మోదాడు. అప్ప‌టికే షాక్ లో ఉన్న ఆమె కేకలు వేయడంతో.. చింటూ పారిపోయాడు. చుట్టుపక్కల వారు రాగా.. జ‌రిగిన విష‌యం చెప్ప‌గా స్థానికులు వెంట‌నే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.  ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మృతిచెందింది.  ఆమె కుమారుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు చింటుని అరెస్ట్ చేశారు.  వావి వరసలు మరచిపోయి.. ఇలా ప్రవర్తించడం ఏంటీ అనే ప్రశ్న తలెత్తుతోంది. స్నేహితుడి తల్లి అంటే తల్లితో సమానం. కానీ చింటు ప్రవర్తన సరికాదని.. కఠినంగా శిక్షించాలని, భ‌విష్య‌త్తులో మ‌రెవ‌రూ ఇలా ప్ర‌వ‌ర్తించ‌కుండా చూడాల‌ని మ‌హిళా సంఘాలు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు కోరుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: