సరదాగా ఆడే జల్లికట్టు ఆట వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఓ వైపు జంతువుల హింస..అని మరోవైపు మనుషుల ప్రాణాలు పోతున్నాయని ఆందోళనలు జరుగుతున్నా వినే నాధుడే లేడు . ఆపడం పక్కన పెట్టి ఈ ఆటకు సపోర్ట్ చేసే సెలబ్రెటీలు కూడా ఉండటం విశేషం. నిజానికి జల్లి కట్టు అనేది తమిళ నాడులో ఆడే సంప్రదాయ ఆట..ఈ ఆటలో ఎద్దులను చంపడం గానీ కొట్టడం గానీ ఉండదు. కేవలం ఎద్దులను మచ్చిక చేసుకుని దీసుకోవడం మాత్రమే ఉంటుంది . అయితే ఈ క్రమంలోనే ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. మనుషులు చుట్టు ముట్టడంతో ఎద్దులు ఏం జరుగుతుందో తెలియక పరిగెత్తుతాయి. వాటిని పట్టుకునే క్రమంలోనే ప్రమాదాలు జరుగుతాయి. తాజాగా జల్లికట్టులో మరో ప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడు శివగంగై జిల్లాలో జరుగుతున్న జల్లికట్టు ఆటలో ప్రమాదం చోటు చేసుకుంది. సరదా కోసం ఆటను చూసేందుకు వచ్చిన ముగురు అమాయకులు బలయ్యారు. అంతే కాకుండా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి .

క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. శివగంగై జిల్లాలో జరుగుతున్న జల్లికట్టు పోటీలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. అయితే గ్రౌండ్ లో ఉన్న ఓ ఎద్దు భయటకు పరుగులు తీసింది. దాంతో ఎద్దు కొమ్ములు గుచ్చుకుని ముగ్గురు స్పాట్ లో చనిపోయారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి . మరికొంతమందికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో మరణించిన వారి ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జల్లికట్టు నిర్వహకులపై కేసు నమోదు చేశారు. ఆట నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: