న్యూఢిల్లీ: ఈ మధ్య హత్యాచార కేసుల్లో కోర్టులు విచిత్రమైన తీర్పులిస్తున్నాయి. మొన్నామధ్య హత్యాచార బాధితురాలికి పోలీసుల సమక్షంలోనే నిందితుడు పెళ్లి చేసుకున్న విషయంత తెలిసిందే. అంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు అనేక రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సుప్రీం కోర్టు కూడా ఓ హత్యాచార కేసులో నిందితుడికి ఇలాంటి ప్రతిపాదనే చేసింది.

 కేసులో బెయిల్ కావాలంటే బాధితురాలిని పెళ్లి చేసుకోవాలని, అప్పుడే తమ నుంచి సాయం లభిస్తుందని తేల్చి చెప్పింది. మహారాష్ట్రలో జరిగిన ఓ హత్యాచార కేసులో మోహిత్ శుభాష్ చవాన్ అనే ప్రభుత్వోద్యోగి నిందితుడిగా ఉన్నాడు. శుభాష్ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఓ స్కూలు విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో అతడిపై పోలీసులు పోస్కో చట్టం కింద అరెస్టు చేశారు.

ఈ కేసు సుప్రీం కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలోనే తనకు బెయిల్ కావాలంటూ మొహిత్ చవాన్ కోర్టును కోరాడు. అయితే బాధితురాలిని పెళ్లి చేసుకుంటానంటే సాయం చేస్తామని సుప్రీం పేర్కొంది. ‘ఆమెను పెళ్లి చేసుకుంటావా..? అప్పుడే నీకు సహాయం చేయగలం. నీవు ఆ బాలికపై అత్యాచారం చేశావు. పెళ్లికి అంగీకరించకపోతే నీ ఉద్యోగం పోతుంది. అలాగే జైలుకు వెళతావు’ అంటూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే అన్నారు.

నిందితుడిని నేరుగా ‘నీవు బాధితురాలిని పెళ్లి చేసుకుంటావా..? ఈ విషయంలో మేము నిన్ను ఒత్తిడి చేయడం లేదు. మేము ఒత్తిడి చేశామని నీవు చెప్పకూడదు. నీ మనసులో ఉన్నదే చెప్పు’ అంటూ బోబ్డే ప్రశ్నించారు. దీనికి సమాధానంగా చవాన్.. ముందు తాను పెళ్లి చేసుకుంటానని కోరానని, కానీ ఆమె నిరాకరించిందని, కానీ ఇప్పుడు నాకు పెళ్లి అయిపోయిందని, ఇప్పుడు తాను పెళ్లి చేసుకోలేనని చెప్పాడు. ఈ క్రమంలోనే అతడికి 4 వారాల పాటు బెయిల్ ఇస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

చవాన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. అత్యాచారంపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించగానే మోహిత్ తల్లి ఆమెను సంప్రదించారని, తన కొడుకు పెళ్లి చేసుకుంటాడని, కేసు పెట్టవద్దని కోరినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. కానీ ఆ బాలిక అంగీకరించలేదని, అయితే 18 ఏళ్లు నిండిన తరువాత పెళ్లి జరిగే విధంగా ఓ పత్రం సిద్ధం చేశారని, అప్పుడు ఆమె అంగీకరించిందని చెప్పారు. అయితే అప్పటికే తన క్లైంటు మొహిత్‌కు పెళ్లి కావడంతో అతడు అంగీకరించలేదని, ఈ క్రమంలోనే పోస్కో కింద కేసు నమోదైందని న్యాయవాది తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: