వరకట్న దాహానికి మరో యువతి బలైంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ యువతి(23) శబర్మతి నదిలో దూకి ప్రాణాలు తీసుకుంది. ఆయేషా ఆరిఫ్ ఖాన్ అనే యువతి ప్రాణాలు తీసుకునే ముందు తన ఫోన్ లో తన చావుకు కారణం ఇదంటూ వీడియో తీసి చనిపోయింది. ఇది తన సొంత నిర్ణయమని.. ఇందులో ఎవరి బలవంతం లేదంటూ వీడియోలో చెప్పింది ఈమె. నాకు ఇక పోరాడే శక్తి లేదు నాన్నా.. ప్రశాంతంగా చనిపోతున్నందుకు సంతోషంగా ఉందంటూ తన తండ్రికి తెలిపింది ఆయేషా. అంతేకాకుండా ‘ఐ లవ్ ఆరిఫ్’ అంటూ తన భర్తకు చివరి మాటలను చెప్పింది. ఈమె బలవన్మరణానికి కారణం అందరి మహిళలు ఎదుర్కొంటున్న మాధిరిగానే వరకట్న దాహానికి ఈమె కూడా బలయ్యింది. ఈ యువతి రాజస్తాన్ లో ఉండే ఆరిఫ్ అనే వ్యక్తిని 2018 లో పెళ్లి చేసుకుంది.
పెళ్లైన మరుసటి రోజునుంచే ఆయేషా వరకట్న వేధింపులను ఎదుర్కొన సాగింది. ముఖ్యంగా తన భర్త, అత్తమామల నుంచే ఈ వరకట్న వేధింపులు రాసాగాయి. రోజురోజుకు వీరి వేధింపులు ఎక్కువ కావడంతో..  గృహ హింసకు  చట్టం కింద వారిపై ఆయేషా స్థానిక పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దాంతో పాటుగా కోర్టులో కేసు వేసింది. అయినా అత్తింటివారి నుంచి వేధింపులు అలాగే కొనసాగాయి. అందులోనూ ఆయేషా ఓ బ్యాంకులో పనిచేస్తూ ఉండేది. అయినా ఆమె పట్ల వరకట్న వేధింపులు మాత్రం ఆగలేదు. దాంతో ఆమెకు ఇక పోరాడే శక్తి లేక ఆ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఆత్మహత్యే శరణ్యమని భావించింది. అందుకే శబర్మతి నది లో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే చనిపోయే ముందు ఆయేషా ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడింది.

నేను అల్లా వద్దకు వెళితే అక్కడే చాలా ప్రశాంతం ఉంటానని చెప్పుకొచ్చింది. ఈ కేసును ఇంకెన్నాళ్లు వాదిస్తారు.. నాకు ఇక ఫైట్ చేసే ఓపిక లేదు నాన్నా.. ఆరిఫ్ కు నచ్చిన విధంగా ఉండని.. అంటూ చాలా సేపే తన తండ్రితో మాట్లాడింది ఆయేషా. అలాగే తన భర్త ఆరిఫ్ కు కూడా ఫోన్ చేసి విషయం చెబితే.. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటూ చాలా దురుసుగా మాట్లాడాడు అతడు. చివరి సారిగా ఆయేషా పేరెంట్స్ తనను ఎలాంటి పిచ్చి నిర్ణయం తీసుకోవద్దని బ్రతిమిలాడుతుండగానే.. ఆయేషా ఫోన్ కట్ చేసేసింది. అనంతరం శబర్మతి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనను చూసిన కొందరు వ్యక్తులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కానీ ఆమె అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు తేల్చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: