అమాయకుల దగ్గర డబ్బులు గుంజేందుకు కేటుగాళ్ళు అనంతకోటి ఉపాయాలు వేస్తున్నారు. ఏదో ఒక రూపంలో అమాయకులకు వల విసురుతూ డబ్బులు గుంజుతున్నతున్నారు. తాజాగా గిఫ్ట్ కార్డుల పేరుతో మోసగాళ్ళు డబ్బులు గుంజుతున్న ఘటనలు బయటపడుతున్నాయి. తాజాగా ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... కార్తీక్ అనే పేరుతో ఓ వ్యక్తికి నిందితుడు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. అనంతరం అతడి అడ్రెస్ కు ఒక లెటర్ పంపించాడు. అందులో స్క్రాచ్ కార్డు ఉంది. అది గీస్తే అందులో  కార్ ఫోటో తో మీరు కార్ గెలుచుకున్నారు. కంగ్రాట్స్ అని  అని రాసి ఉంది. ఇంకేముంది ఎగిరి గంతేసి ఆ నంబర్ కు ఫోన్ చేశారు. కాగా నిందితుడు కరోనా కారణంగా కార్ ను పంపించలేకపోతున్నామని..రూ.45 పంపించాలని కోరాడు. దాంతో బాధితుడు 45 వేలు పంపించాడు.

అయినప్పటికీ కార్ ఇంటికి చేరలేదు. దాంతో బాధితుడు మరోసారి ఫోన్ చేసాడు. అలా మొత్తం రూ.95 వేలు పోగొట్టుకున్నాడు. ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి బాధితుడు పోలీసులను ఆశ్రచించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో 5గురు బీహార్ , 5గురు మంచిర్యాల కు చెందిన వారు ఉన్నారు. నింధితుల వద్ద నుండి 900 స్క్రాచ్ కార్డులు, 42 ఫోన్లు, 2ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇప్పటి వరకు మొత్తం రూ.2 కోట్లు దోచుకున్నట్టు చెప్పారు. ఇక సైబరాబాద్ పరిధిలో ఇలాంటి ఘటనలు మూడు నమోదయ్యాయని సజ్జాన్నర్ వెల్లడించారు. ఇలాంటి మోసాల ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఇలాంటి లెట‌ర్స్ ఎవ‌రికైనా వ‌చ్చినా..డ‌బ్బులు పంపాలంటూ కాల్స్ వ‌చ్చినా వెంట‌నే త‌మ‌కు ఫిర్యాదు చేయాల‌ని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: