ముందు సహజీవనం అంతా బాగుందనుకుని ఆ త‌ర్వాత కూడా బంధం కొన‌సాగింద్దామ‌ని అనుకుంటేనే పెళ్లి..లేదంటే బ్రేక‌ప్‌.. అక్క‌డితో ల‌వ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి ఎవ‌రి దారి వారు చూసుకోవ‌డం.. ఇదీ ఇప్పుడు నయా ట్రెండ్‌. అయితే బ్రేక‌ప్ చెప్పుకుని చెరో దారి చూసుకునే వారి సంఖ్యే అధికంగా ఉంటోందంట‌. అయితే కొత్త విష‌యం ఏంటంటే రిలేషన్‌షిప్ బ్రేక్ చేసుకున్న తర్వాత.. కొందరు మహిళలు, తన మాజీ భాగస్వామిపై అత్యాచారం కేసులు పెడుతున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని.. నెలల తరబడి తనను రేప్ చేశాడని కేసులు పెట్ట‌డం.. ఆ త‌ర్వాత కోర్టు వ‌ర‌కు వెళ్తున్నాయి. ఈ త‌ర‌హా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.


సహజీవనంలో ఉండే శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని స్ప‌ష్ట‌త ఇచ్చింది. ఇద్దరి ఇష్టంతోనే సహజీవనంలో శృంగారం జరుగుతుందని పేర్కొంది. పురుషుడు మహిళను క్రూరంగా హింసించినా.. అది దాడి కిందకే వస్తుంది తప్ప, అత్యాచారం కిందకు రాదని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేసింది. తాజాగా సుప్రీం ఈ వ్యాఖ్య‌లు చేయ‌డానికి కార‌ణం యూపీకి చెందిన ఓ మ‌హిళ ప్రియుడిపై కేసు పెట్ట‌డం.. కోర్టు వ‌రకు వెళ్ల‌డం విశేషం. యూపీకి చెందిన వినయ్ ప్రతాప్ సింగ్, ఓ మహిళతో రెండేళ్లుగా ప్రేమాయ‌ణం చేస్తున్నాడు. ఈక్ర‌మంలోనే  సహజీవనం కూడా చేస్తున్నాడు. అయితే కొద్దిరోజుల త‌ర్వాత వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో వేర్వేరుగా ఉంటున్నారు. వినయ్ ప్రతాప్ మరొక మహిళను పెళ్లి చేసుకున్నాడు.


 ఐతే తనతో రెండేళ్లు సహజీవనం చేసి, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి.. మోసం చేశాడనని బాధిత మహిళ 2019లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను రెండేళ్ల పాటు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు  కేసు న‌మోదు చేశారు.  దానిని సవాల్ చేస్తూ.. వినయ్ ప్రతాప్ కోర్టును ఆశ్ర‌యించాడు. అయితే స‌ద‌రు మ‌హిళ‌కు ఈ కేసులో చుక్కెదురైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: